పదేళ్ల తర్వాత స్టార్‌ హీరో మరో ప్రయత్నం..!

ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ 'ధురంధర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.;

Update: 2025-08-29 12:30 GMT

బాలీవుడ్‌ హీరో రణ్వీర్‌ సింగ్‌ ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలను చేయాలని, విభిన్నమైన పాత్రలతో అలరించాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకోసం పాత్రల ఎంపిక విషయంలో రణ్వీర్‌ సింగ్‌ చాలా ఆలోచన చేస్తాడని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన భిన్నంగా ఉండాలనే తపనతో సినిమాలను ఎంపిక చేసుకుంటాడని ఆయన సినిమాలను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ 'ధురంధర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ధురంధర్‌ ఉంటుందనే విశ్వాసంను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశాడు.

ధురంధర్‌ మూవీ రిలీజ్‌ కి రెడీ

ఈ స్పై థ్రిల్లర్‌కి ఆదిత్య ధార్‌ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబోలో రూపొందిన 'ధురంధర్‌' విడుదలకు ముందే మరో సినిమా కన్ఫర్మ్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. సాధారణంగానే రణ్వీర్‌ సింగ్‌కు పౌరాణిక పాత్రలు, సినిమాలు అంటే ఆసక్తి ఉంటుంది. అలాంటి రణ్వీర్‌ సింగ్‌తో ఆదిత్య ధార్‌ ఒక మంచి పౌరాణిక పాత్ర గురించి చెప్పాడట. చాలా కాలం నుంచి చరిత్ర మరిచి పోయిన వీరుడి గురించి చెప్పాలని వీరిద్దరు అనుకుంటున్నారట. అందుకోసం హిందూ పురాణాలను తిప్పి వేసిన ఆదిత్య ధార్ ఒక మంచి పాత్రను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పాత్ర చుట్టూ కథను అల్లుకుంటూ వెళ్తున్నాడని, నిజంగా జరిగిన ఘటనలను తీసుకుని, కల్పిత పాత్రలను యాడ్‌ చేస్తూ ఆదిత్య ధార్‌ కథను రెడీ చేసుకుంటూ ఉన్నాడు అంటూ బాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

రణ్వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధార్‌ మూవీ

ప్రస్తుతానికి ధురంధర్‌ సినిమా చివరి దశ షూటింగ్‌ వర్క్‌ తో బిజీగా ఉన్న దర్శకుడు ఆదిత్య ధార్‌ వచ్చే ఏడాదిలో ఆ పౌరాణిక సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి పనులను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అంతే కాకుండా ధురంధర్‌ సినిమా హిట్ అయితే రణ్వీర్‌ సింగ్‌తో ముందు ముందు మరిన్ని సినిమాలను చేసే విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం ఐడియాలను కూడా దర్శకుడు ఆదిత్య ధార్ చెప్పాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. రణ్వీర్‌ సింగ్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. అందుకే ఆయనకు ఈ సినిమా అత్యంత కీలకం. ఈ సినిమా పై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు. సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని, ఆ వెంటనే వీరి కాంబోలో కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

బాజీరావు మస్తానీ తర్వాత ఇప్పుడు

హిందూ పురాణాల నుంచి తీసుకున్న పాత్రలకు, కథలకు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అందుకే రణ్వీర్‌ సింగ్‌, ఆదిత్య ధార్‌ల కాంబోలో పౌరాణిక సినిమాను చాలా మంది ముందు నుంచే ఆసక్తిగా స్వాగతిస్తున్నారు. పదేళ్ల క్రితం రణ్వీర్ సింగ్‌ బాజీరావు మస్తానీ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో రణ్వీర్‌ సింగ్‌ లుక్‌ తో పాటు అన్ని విషయాలకు పాజిటివ్‌ మార్కులు దక్కాయి. ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు వెయిట్‌ ఎక్కువ అయినప్పటికీ హీరో రణ్వీర్‌ సింగ్‌ గురించి ప్రముఖంగా ఆ సమయంలో చర్చ జరిగింది. అందుకే మరోసారి పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేయాలని రణ్వీర్‌ సింగ్‌ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే దర్శకుడు ఆదిత్య ధార్ ఇలా పౌరాణిక ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆలోచన చేస్తున్నాడట.

Tags:    

Similar News