ఆ సినిమాకు లైన్ క్లియ‌ర్..ఎటాక్ ఒక్క‌టే ఆల‌స్యం

ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `దురంధ‌ర్` రిలీజ్ కు రెడీ అయింది.;

Update: 2025-12-03 19:30 GMT

ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `దురంధ‌ర్` రిలీజ్ కు రెడీ అయింది. డిసెంబ‌ర్ 5న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప‌నులు ముగించుకుంది. సినిమాలో భారీ హింసాత్మ‌క స‌న్నివేశాలుండ‌టంతో సెన్సార్ `ఏ `స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా పెద్ద‌ల‌కు మాత్ర‌మేన‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్య కాలంలో `ఏ` స‌ర్టిఫికెట్ సినిమాల‌కు మంచి డిమాండ్ క‌నిపిస్తుంది. అలాంటి సినిమాల‌పై అంచాల‌ను రెట్టింపు అవుతున్నాయి. సినిమాలో కొత్త‌గా ఏదో చెప్ప‌బోతున్నారు? అన్న హైప్ క్రియేట్ అవుతుంది.

అలాగే `దురంధ‌ర్` న‌డివి కూడా ఎక్కువ‌గానే ఉంది. 3.34 గంట‌ల ర‌న్ టైమ్ తో రిలీజ్ అవుతుంది. 17 ఏళ్ల కాలంలో ఇంత నిడివితో ఏ బాలీవుడ్ సినిమా రిలీజ్ కాలేదు. 17 ఏళ్ల క్రితం హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించిన `జోదా అక్బ‌ర్` 3.50 గంట‌ల నిడివితో రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత మరే సినిమా ఇంత నిడివితో రిలీజ్ కాలేదు. దీంతో `దురంధ‌ర్` నిడివిలో రెండ‌వ చిత్రంగా రికార్డు సృష్టించింది. `దురంధ‌ర్` వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందించారు. 1999లో జ‌రిగిన ఐసీ 814 విమాన హైజాక్, 2001లో భార‌త పార్లమెంట్ దాడుల నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.

పాకిస్తాన్ కేంద్రంగా ప‌ని చేస్తోన్న ఓ ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ ను అంతం చేయ‌డానికి ఇండియా ఇంటిలిజెన్స్ చీఫ్ అజ‌య్ స‌న్యాల్ ( మాధ‌వ‌న్) ఓ మిష‌న్ చేప‌డుతారు. దీనిలో భాగంగా పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల యువ కుడిని(ర‌ణ‌బీర్ సింగ్ ) ఎంచుకుంటారు. పాకిస్తాన్ పై ప‌గ‌తో జైలు జీవితాన్ని గ‌డుపుతోన్న ఆ యువ‌కుడు రంగంలోకి దిగితే? ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్నారు. అలాగే ఈ చిత్రం మేజ‌ర్ మోహిత్ శ‌ర్మ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతుంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిలో భాగంగా మోహిత్ త‌ల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో రిలీజ్ పై స‌స్పెన్స్ నెల‌కొంది.

అయితే ఈ సినిమాకు-మోహిత్ జీవిత క‌థ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తాజాగా సీబీఎఫ్ సీ నుంచి కూడా క్లియ‌రెన్స్ రావ‌డంతో? రిలీజ్ కు లైన్ క్లియ‌ర్ అయింది. మ‌రో రెండు రోజుల్లో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మ‌ధ్య కాలంలో ర‌ణ‌వీర సింగ్ న‌టించిన సినిమాలు కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌డం లేదు. దీంతో ఈ సినిమాపై ర‌ణ‌వీర్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు..ర‌ణ‌వీర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News