ఆ హీరోపై ఎగ్జిట్ వలయం అసలెం జరుగుతోంది?
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎగ్టిట్ వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.;
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎగ్టిట్ వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు మార్పులు చేర్పులు జరగడం సహజమే. కానీ రణవీర్ విషయంలో మాత్రం ఆయన ఒప్పుకున్న ప్రతి పెద్ద ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎగ్జిట్ వార్తలు కేవలం గాలి వార్తలుగా మిగిలిపోకుండా నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఆయన ప్రాజెక్టుల నుండి బయటకు వస్తున్నారా లేక ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుందా? అన్నది హాట్ టాపిక్.
`డాన్ 3` విషయంలో జరిగిన ప్రచారం సినీ వర్గాలను ఏ రేంజ్ లో ఆశ్చర్యపరిచిందో తెలిసిందే. షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ వస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుండి ఒక వర్గం ప్రేక్షకులు దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని మేకర్స్ మళ్లీ షారుఖ్ వైపు చూస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. తాజాగా దర్శకుడు ఫర్హాన్ అక్తర్ క్లారిటీ తో రణవీర్ ఎక్కడికీ వెళ్లలేదని, సినిమా పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని స్పష్టం చేయడంతో ప్రచారానికి తెరపడింది.
అలాగే `ప్రళయ్` సినిమా విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. జై మెహతా దర్శకత్వంలో రూపొందాల్సిన భారీ ప్రాజెక్ట్ నుండి రణవీర్ తప్పుకున్నారని, బడ్జెట్ సమస్యలు , డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం తో ఈ సినిమా వదులుకు న్నారని వార్తలు వచ్చాయి. తాజాగా జై మెహతా స్వయంగా స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు. వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి ఎగ్జిట్ వార్తలు రావడం వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి.
రణవీర్ సింగ్ లక్ష్యంగా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తున్నా? అన్నది చర్చనీయాంశంగా మారింది. `ధురంధర్` విజయాన్ని పక్కన బెడితే? దీనికి ప్రధాన కారణం రణవీర్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే అని కొంతమంది భావిస్తున్నారు. ఒక హీరో వరుస విజయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు వచ్చినా? ఎవరూ నమ్మరు. కానీ డల్ ఫేజ్‌లో ఉన్నప్పుడు వచ్చే నెగటివ్ వార్తలు త్వరగా వైరల్ అవుతాయి. దీంతో హీరో మార్కెట్ వాల్యూను తగ్గించే ప్రయత్నం జరుగుతోందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
సినిమా పరిశ్రమలో హీరోను మానసిక ఒత్తిడికి గురిచేయడానికి లేదా ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకాన్ని తగ్గించడానికి ఇదొక వ్యూహంగా మారుతోందా అన్న డిస్కషన్ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది. రణవీర్ సింగ్ చుట్టూ ఈ ఎగ్జిట్ వలయం వెనుక అసలు ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరిగిన ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే `ధురంధర్` హిట్ ప్రాంచైజీ తో చెంప పెట్టు లాంటి సమాధానం వెళ్లింది. తాజాగా అనుకుంటోన్న ప్రాజెక్ట్ లు కూడా పట్టాలెక్కితే? సన్నివేశం పూర్తిగా మారిపోతుందన్నది అంతే వాస్తవం.