టీవీ నటి ప్రేమలో నిండా మునిగిన యూట్యూబర్
ప్రముఖ యూట్యూబర్, ఎంటర్ ప్రెన్యూర్ రణవీర్ అల్లబాడియా పరిచయం అవసరం లేదు.;
ప్రముఖ యూట్యూబర్, ఎంటర్ ప్రెన్యూర్ రణవీర్ అల్లబాడియా పరిచయం అవసరం లేదు. హిందీ చిత్రసీమ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉన్నాడు. ఇటీవల కొన్ని వివాదాలతోను అతడి పేరు మార్మోగింది. పాడ్ కాస్ట్ లైవ్‌లో అతడు `పేరెంట్ సన్నిహిత సన్నివేశం` గురించి ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత అది వివాదంగా మారింది. ఇక వివాదాల సంగతి అటుంచితే రణ్ వీర్ కొంత కాలంగ టీవీ నటి నిక్కీ శర్మతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
దీపావళి నాడు ప్రతిభావంతుడైన యూట్యూబర్ తన సోషల్ మీడియా ద్వారా ప్రేమలో ఉన్న విషయంపై హింట్ ఇచ్చాడు. నారింజ రంగు దుస్తులు ధరించిన అందమైన అమ్మాయితో కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. ఆమె ఎవరు? అన్నది రివీల్ చేయకపోయినా కానీ.. నెటిజనులు ఎవురికి వారు ఈ షాడో ఉమెన్ ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించారు. దీపావళి రోజు ధరించిన ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల సారూప్యతల ఆధారంగా ఆ మహిళను జూహి భట్ అని గుర్తించారు.
ఆసక్తికరంగా యూట్యూబర్ రణవీర్ కొత్త ప్రియురాలి గురించి చర్చిస్తున్న సమయంలోనే, అతడి మాజీ స్నేహితురాలు నిక్కీ శర్మ కూడా మరొక సీక్రెట్ ఇన్‌స్టా స్టోరీతో వార్తల్లో నిలిచింది. నిక్కీ తన వెర్షన్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం యూట్యూబర్ రణవీర్ ప్రేమాయణం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే టీవీ నటితో రణవీర్ ప్రేమాయణంపై పలువురు నెటిజనులు స్పందించారు. ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఇందులో ఏం ఉంటుంది? మీ ఇద్దరి సంబంధం ఇంతకుముందే విఫలమైంది కాబట్టి ముందుకు సాగండి. ఎప్పుడూ ఇతరులను కించపరచాలని ఎందుకు కోరుకుంటారు?! మీకు అనుకూలమైన వ్యక్తిని కనుగొనండి! అని రాసారు. అతని పాడ్‌కాస్ట్ విజయవంతం అయినందున మీరు అతనితో డేటింగ్ చేసారు. అతను సాధారణ వ్యక్తి అయితే డేటింగ్ చేసేదానివి కాదు! అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు.