రాణి ముఖర్జీ ఆ గొలుసు వెనుక స్టోరీ

'మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే' సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాణి ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్‌ దక్కిన విషయం తెల్సిందే.;

Update: 2025-09-27 07:00 GMT

'మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే' సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాణి ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్‌ దక్కిన విషయం తెల్సిందే. జాతీయ అవార్డ్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న రాణి ముఖర్జీ వార్తల్లో నిలిచింది. ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాణి ముఖర్జీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ధరించిన చీరతో పాటు, ఆమె మెడలో ధరించిన గొలుసు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మెడలో ధరించిన గొలుసుపై అదిరా అనే పేరు ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఆ సమయంలో దాన్ని ఒక డిజైన్‌గానే భావించారు. సోషల్‌ మీడియాలో గొలుసుపై అదిరా అక్షరాలను చూసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో కొన్ని రోజుల్లోనే ఆ గొలుసు గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. దాంతో రాణి ముఖర్జీ స్పందించింది.

జాతీయ అవార్డ్‌ దక్కించుకున్న రాణి ముఖర్జీ

ప్రతి నటికి నటుడికి జాతీయ అవార్డ్‌ అనేది లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్‌ లాంటిది. నాకు జాతీయ అవార్డ్‌ వచ్చిన సమయంలో చాలా మంది నేను అవార్డ్‌ను అందుకోవడం చూడాలి అనుకున్నారు. ముఖ్యంగా నా కూతురు అదిరా నేను జాతీయ అవార్డ్‌ను అందుకోవడంను చూడాలని అనుకుంది. కానీ ఆమె వయసు 14 ఏళ్ల వయసు లోపు ఉండటం వల్ల అక్కడకు రాలేక పోయింది. అవార్డ్‌ కార్యక్రమంకు 14 ఏళ్లు పూర్తి అయిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అందుకే అదిరా కి అక్కడకు వచ్చే అవకాశం దక్కలేదు. అందుకే అదిరా నేను అవార్డ్‌ అందుకోవడం చూడలేదు. తను కార్యక్రమంకు రాకపోవడం నాకు చాలా బాధను కలిగించింది. అందుకే తను రాకున్నా తన గుర్తుగా ఏమైనా నా వెంట ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అందుకే అదిరా పేరు ఉన్న గొలుసు ధరించాను అంటూ తాజా ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ చెప్పింది.

అదిరా పేరుతో ఉన్న గొలుసుతో...

అదిరా పేరుతో ఉన్న గొలుసు ధరించడం వల్ల కార్యక్రమానికి నా కూతురు వచ్చినట్లుగా అనిపించింది, చాలా మంది రాణి ముఖర్జీ తన వెంట కూతురును కూడా తీసుకు వెళ్లింది అంటూ సోషల్‌ మీడియాలో నా గొలుసు గురించి మాట్లాడుకోవడం నేను చూశాను. అవార్డ్‌ వేడుకలో నేను నా కూతురుతో ఉన్నట్లుగానే అనిపించింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి, నా కూతురు గురించి ప్రముఖంగా మాట్లాడుకోవడం వల్ల అదిరా కూడా నాతో పాటు అవార్డ్‌ వేడుకకి వచ్చినట్లు అనిపించింది అంటూ రాణి ముఖర్జీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రాణి ముఖర్జీ తన కూతురుపై ఉన్న ప్రేమను ఇలా చూపించింది. ఆ మధ్య రాణి ముఖర్జీ తన కూతురు ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజా ఇంటర్వ్యూలో మాత్రం అదిరా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి స్పందించలేదు.

మిసెస్‌ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా..

2023లో విడుదలైన మిసెస్ చటర్జీ వర్సెస్‌ నార్వే సినిమాలో రాణి ముఖర్జీ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లీగల్ డ్రామాకి ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహించారు. రాణి ముఖర్జీ, అనిర్బన్‌ భట్టాచార్య, నీనా గుప్తా, జిమ్ సర్భ్‌ లు నటించారు. ఈ సినిమా అనురూప్ భట్టాచార్య, సాగరికా చక్రవర్తి అనే భారతీయ వలస దంపతుల నిజ జీవిత కథ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమాకు థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో పాజిటివ్‌ రివ్యూలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా భారీ వసూళ్లు నమోదు కాలేదు. అయినా కూడా రాణి ముఖర్జీ కి మంచి ప్రశంసలు దక్కాయి. 2025 భారత ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డ్‌ల్లో రాణి ముఖర్జీకి ఉత్తమ నటిగా అవార్డ్‌ దక్కింది. సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా జాతీయ అవార్డ్‌ దక్కడంతో రాణి ముఖర్జీ సంతోషం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News