• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామాయణం కోసం 'యానిమల్‌'...

రామాయణం కోసం 'యానిమల్‌' ఏం చేస్తున్నాడంటే...!

| రాముడి బాడీ లాంగ్వేజ్ ను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలాగ్‌ డెలవరీ మరియు ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్ ఇలా అన్ని విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటూ ఉన్నాడట.

By - Tupaki Desk
Update: 2024-02-08 06:13 GMT

రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ రామాయణం ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నితేష్ తివారీ సుదీర్ఘ కాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న రామాయణం లో బాలీవుడ్ స్టార్‌ రణబీర్ కపూర్‌ ను రాముడిగా చూపించబోతున్నారు.

అధికారిక ప్రకటన రానప్పటికి రాముడి పాత్రలో రణబీర్ కపూర్‌ కన్ఫర్మ్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా యానిమల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుని తన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రణబీర్ కపూర్‌ గత కొన్నాళ్లుగా రాముడి పాత్రకు రెడీ అవుతున్నాడట.

రాముడి బాడీ లాంగ్వేజ్ ను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలాగ్‌ డెలవరీ మరియు ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్ ఇలా అన్ని విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటూ ఉన్నాడట. పాత రామాయణ కథాంశ సినిమాలు మరియు సీరియల్ ను చూడటం ద్వారా రణబీర్ కపూర్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

భాష తో పాటు ప్రతి విషయంలో కూడా రణబీర్‌ కపూర్‌ సిద్ధం అవుతున్నాడు. రామాయణం పూర్తి అయినంత కాలం రణబీర్ కపూర్ మరే సినిమాకు కమిట్‌ అవ్వకూడదని కూడా భావిస్తున్నాడట. మొత్తానికి ఈ ఏడాదిలో రామాయణం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు లేదా మూడు పార్ట్ లను 2030 వరకు విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్‌.

ఇక రామాయణం లో సీత పాత్రకు గాను సాయి పల్లవి ని సంప్రదించారని తెలుస్తోంది. కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ ను రావణుడి పాత్రకు గాను సంప్రదించారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. మొత్తానికి రామాయణం పాన్‌ ఇండియా రేంజ్ దాటి అంతకు మించి అన్నట్లుగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Tags:    
  • Bollywood 
  • Ranbirkapoor 
  • Ramayanam 
  • Movie 
  • Niteshtiwari 
  • Shriram 
  • Character 
  • Preperation 

Similar News

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

Copyright @2026

Powered by Blink CMS