బాలీవుడ్ రామాయణం.. దర్శనమిచ్చిన సీతారాముడు

సీతాదేవి గెటప్ లో సాయి పల్లవి, శ్రీరాముడి లుక్ లో రణబీర్ కపూర్ ఈ పిక్స్ లో కనిపిస్తున్నారు. వారిద్దరికి సంబందించిన కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు అనిపిస్తుంది.

Update: 2024-04-27 08:07 GMT

నితీష్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం మూవీ గ్రాండ్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రణబీర్ కపూర్ ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర కోసం లుక్ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకున్నాడు. యానిమల్ లో కండలు తిరిగిన శరీరం నుంచి స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు.

ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటించబోతోంది. అలాగే రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్రని చేయబోతున్నారు. భారీ కాన్వాస్ పై విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని నితీష్ తివారి చూపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి మీద కీలక సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

వీటికి సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీతాదేవి గెటప్ లో సాయి పల్లవి, శ్రీరాముడి లుక్ లో రణబీర్ కపూర్ ఈ పిక్స్ లో కనిపిస్తున్నారు. వారిద్దరికి సంబందించిన కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు అనిపిస్తుంది. ఈ లుక్స్ చూస్తుంటే సాయి పల్లవి సీతాదేవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంది.

అలాగే రణబీర్ కపూర్ కూడా శ్రీరాముడి క్యారెక్టర్ కి తగ్గ బాడీ లాంగ్వేజ్ తో ఉన్నాడు. రామాయణం కథని ఇప్పటికే ప్రేక్షకులు డిఫరెంట్ భాషలలో చాలాసార్లు చూసేసారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా రామాయణం కథ ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది. అయితే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పిన రామాయణం కథకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతూనే ఉన్నారు.

అందుకే మరింత రీసెర్చ్ చేసి సిరీస్ గా నితీష్ తివారి రామాయణం మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో తన పెర్ఫార్మెన్స్ తో అందరిని తన వైపుకి తిప్పుకున్న సాయి పల్లవి రామాయణంలో సీతాదేవి పాత్రలో ఏ విధంగా మెప్పిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. 2025లో రామాయణం సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చిత్ర యూనిట్ చేయబోతోందని తెలుస్తోంది. మరి నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ రామాయణం కథ ఈ జెనరేషన్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News