బాక్సాఫీస్ సునామీ ఖాయం: `రామాయణ` ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన యశ్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ `రామాయణ`.

Update: 2026-07-18 17:18 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ `రామాయణ`. ఈ సినిమా `ప్రథమ సంకల్ప` ఈవెంట్‌ను దిల్లీలో అత్యంత వైభ‌వంగా నిర్వహించారు. అన్ని భాషల మీడియా ప్రతినిధులు హాజరైన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రత్యేకంగా స్క్రీన్ చేశారు. అక్కడ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు కంప్లీట్ గా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమోషనల్ కంటెంట్ సృష్టించిన ఇంపాక్ట్ నెవర్ బిఫోర్ అనేలా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వస్తోంది.

భారతదేశంలోనే అత్యంత భారీ సినిమాగా మొదటి నుంచి ప్రచారం పొందుతున్న `రామాయణ`.. ఆ నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకోబోతోందని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. సినిమా కోసం కేటాయించిన భారీ వనరులు, గ్రాండియర్ మేకింగ్ ప్రతి విజువల్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఏ భారతీయ సినిమాలోనూ చూడని విధంగా ఈ భారీ మూవీ కాన్వాస్ అత్యంత అద్భుతంగా.. కంటికి ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోందని ట్రైలర్ టాక్ ద్వారా తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో దర్శకుడు నితీష్ ఈ పౌరాణిక గాథను వెండితెరపై ఆవిష్కరించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఎంతో ఆకర్షణీయంగా.. డిగ్నిఫైడ్‌గా కనిపించగా.. సీతాదేవి పాత్రలో నటించిన సాయి పల్లవి తనదైన నటనతో ఆ పాత్రకు కావలసిన ప్రశాంతతను, గాంభీర్యాన్ని పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చిందని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే వీరందరి కంటే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన `మాన్‌స్టరస్` స్క్రీన్ ప్రెజెన్స్‌తో.. అద్భుతమైన ఆరాతో అందరి దృష్టిని ఆకర్షించి... షో స్టాప‌ర్ గా నిలిచార‌ని టాక్ వినిపిస్తోంది. రావణాసురుడిగా యశ్ చూపించిన ఇంపాక్ట్ -స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేకించి డిబేట్ ప్రారంభ‌మైంది.

ఈ ఢిల్లీ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యశ్ స్వయంగా పాల్గొని వేదికపై మాట్లాడటం విశేషం. ఈ సందర్భంగా య‌ష్ మాట్లాడుతూ.. ``ఇది యావత్ భారతదేశం యొక్క కల. ప్రభు శ్రీరాముడి కథను గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచడమే మా లక్ష్యం. రణ్‌బీర్ ఈ పాత్ర కోసం తన్ను తాను సమర్పించుకుని మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అలాగే సాయి పల్లవి కళ్లే సీత పాత్రలో అన్నీ మాట్లాడతాయి`` అంటూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. లక్ష్మణ్ పాత్ర ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ కాబోతుందని.. సినిమాలోని ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్విక్షన్‌తో పనిచేశారని యశ్ తన స్పీచ్‌లో గర్వంగా చెప్పుకొచ్చారు.

సినిమాలో విలన్ (ప్రతినాయకుడు) పాత్ర ఎంత బలంగా ప్రెజెంట్ చేస్తే... హీరో (నాయకుడు) పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. ఆ రకంగా `రామాయణ` మేకర్స్ వంద శాతం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. రావణుడిగా యశ్ క్యారెక్టరైజేషన్... రాముడిగా రణ్‌బీర్ పాత్రల మధ్య వచ్చే ఘర్షణ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. లీడ్ కాస్ట్ అందరి పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజువల్ వండర్ థియేట్రికల్ ట్రైలర్, డిజిటల్ వేదికగా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Tags:    

Similar News