• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిరణ్యకశ్యప ట్విస్ట్.....

హిరణ్యకశ్యప ట్విస్ట్.. గుణశేఖర్ బాధ అర్థమవుతోందా?

| ఇక ఇప్పుడు గుణశేఖర్ ఇన్ డైరెక్ట్ గా ఆ విషయంపై సెటైర్ వేసినట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-07-20 05:09 GMT

టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఉత్తేజకరమైన కామిక్-కాన్ ఈవెంట్ కోసం ప్రస్తుతం శాన్ డియాగోలో ఉన్నారు. ప్రాజెక్ట్-కె అలాగే హిరణ్యకశిప అనే పౌరాణిక సినిమాలకు మంచి బజ్ క్రియేట్ చేసేందుకు ఒక వేదికను సెట్ చేసుకున్నారు. అయితే ప్రాజెక్ట్ K విషయంలో అంతా సవ్యంగానే ఉన్నప్పటికి హిరణ్యకశ్యప విషయంలో మాత్రం అనేక రకాల కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యే అవక6 ఉన్నట్లు తెలుస్తోంది.

అసలైతే ఈ ప్రాజెక్ట్ ను గుణశేఖర్ తెరపైకి తీసుకు రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమా అనంతరం రానా దగ్గుపాటి గుణశేఖర్ తోనే ఆ సినిమాను చేయాలని అనుకున్నాడు ఇక ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా గుణశేఖర్ మొదట తన సొంత ఖర్చులతోనే మొదలు పెట్టాడు.

ఇక తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ హాలీవుడ్ రేంజ్ లోనే ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలి అని అతనితో చేతులు కలిపింది. అంతేకాకుండా పలు హాలీవుడ్ సంస్థలతో కూడా చర్చలు జరిపారు. ఇక కరోనా కారణంగా ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ గ్యాప్ లోనే గుణశేఖర్ సమంతతో శాకుంతలం అనే సినిమాను తెర పైకి తీసుకువచ్చాడు. ఇక అది ఫ్లాప్ కావడంతో హిరణ్యకశిపుడు తెరపైకి రాకపోవచ్చని, అనుమానమే అని అందరికీ అర్థమైపోయింది.

అయితే ఇంతలో హఠాత్తుగా రానా దగ్గుపాటి ఆ ప్రాజెక్టు పై అధికారికంగా ఎనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టుకు రచయితగా త్రివిక్రమ్ చేయబోతున్నట్లు కూడా ఆయన వివరణ ఇచ్చారు. కానీ దర్శకుడు మాత్రం గుణశేఖర్ కాదు అని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు గుణశేఖర్ ఇన్ డైరెక్ట్ గా ఆ విషయంపై సెటైర్ వేసినట్లు తెలుస్తోంది.

దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని గుణశేఖర్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. దీంతో ఆయన హార్ట్ అయినట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిజానికి గుణశేఖర్ ప్రాజెక్ట్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఆయన కథ అనుకున్నప్పుడు త్రివిక్రమ్ స్వయంగా వచ్చి నేను డైలాగ్స్ రాస్తానని అన్నారని గుణశేఖర్ శాకుంతలం ఇంటర్వ్యూలలో చెప్పారు.

ఇక రానా మాత్రం ఇప్పుడు కేవలం త్రివిక్రమ్ ను మాత్రమే ట్రాక్ లోకి తీసుకు వచ్చి గుణశేఖర్ ను మాత్రం పట్టించుకోకపోవడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై రానా భవిష్యత్తులో ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    
  • Hiranyakashyapa 
  • RanaDaggubati 
  • GunaShekar 
  • Tollywood 
  • Projectk 
  • TrivikamSrinivas 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS