శ్రీరాముడు హ్యాండ్ స‌మ్ హంక్ లుక్ ఇలా!

గాళ్స్ లో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-05-09 12:30 GMT

గాళ్స్ లో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ప్ర‌త్యేక‌మైన లేడీ ఫాలోయింగ్ క‌లిగిన హీరో ర‌ణ‌బీర్. గాళ్స్ ఫాలోయింగ్ లో హృతిక్ రోష‌న్ త‌ర్వాత ఆయ‌న రేంజ్ ని ట‌చ్ చేసింది ర‌ణ‌బీర్ ఒక్క‌డే. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోలున్నా! అత్య‌ధికంగా గాళ్స్ లో క్రేజీ హీరోలుగా వీరిద్ద‌రికీ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. బాలీవుడ్ అంద‌గాళ్లు ఎవ‌రంటే? ఈ స్టార్ల ఇద్ద‌రి పేర్లే చెబుతారంతా. తాజాగా ర‌ణ‌బీర్ క‌పూర్ న్యూ లుక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.


అందులో ర‌ణ‌బీర్ హ్యాండ్ స‌మ్ లుక్ కి గాళ్స్ అంతా మ‌రోసారి పిదా కాక త‌ప్ప‌దు. ట్రెండింగ్ హెయిర్ స్టైల్లో ర‌ణ‌బీర్ స్మార్ట్ లుక్ అదిరిపోయింది. ఇందులో ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తున్నాడు. ఎలాంటి మ్యాక‌ప్ లేకుండా క్లిక్ చేసిన పిక్ ఇది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. రాక్ స్టార్ స్మార్ట్ లుక్ ని పొగిడేస్తూ లేడీ ఫాలోవ‌ర్స్ కామెంట్లు ఆస‌క్తిక‌రం. హ్యాండ్ స‌మ్ హంక్.. చాక్లెట్ బోయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read more!

అయితే శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న ర‌ణ‌బీర్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి షాక్ అవుతున్న వారు లేక‌పోలేదు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ రామాయ‌ణం ఆధారంగా `రామాయ‌ణ్` ని భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీరాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. రాముడి పాత్ర కోసం ర‌ణ‌బీర్ చాలా క‌స‌ర‌త్తులే చేసాడు. బాగా వెయిట్ లాస్ అయ్యాడు.


హెయిర్ స్టైల్ కూడా మారింది. రాముడి లుక్ తో కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అందులో అచ్చంగా రాముడు ఇలాగా ఉంటాడా? అన్నంత అందంగా క‌నిపించాడు ర‌ణ‌బీర్. అలాంటి ర‌ణబీర్ ని స్మార్ట్ లుక్ లో చూసే స‌రికి అభిమానులు ఒకింత ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈయ‌న ఇంకా రాముడి గెట‌ప్ వేయ‌లేదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామాయ‌ణ్ కి మ్యూజిక్ లెజెండ్- ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ‌మాన్- హాలీవుడ్ దిగ్గ‌జం హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News