రణబాలి : ఈ యాంగిల్ అస్సలు ఊహించలేదు

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' విడుదలకు రెడీ అవుతోంది.

Update: 2026-09-10 11:01 GMT

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' విడుదలకు రెడీ అవుతోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 16, 2026న విడుదల కాబోతున్న రణబాలి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. టాక్సీవాలా, శ్యామ్‌ సింగ్ రాయ్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న కుర్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి రూపొందుతున్న నేపథ్యంలో మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ఇలా ఉంటుంది అనే అంచనాతో ఇప్పటి వరకు ప్రేక్షకులు ఉన్నాయి. తన మొదటి రెండు సినిమాల మాదిరిగా ఆత్మ ల నేపథ్యంలో రణబాలి ఉంటుందని అనుకున్నారు. కానీ మెల్ల మెల్లగా పాత్రలు పరిచయం చేస్తూ, టీజర్ విడుదల చేసిన తర్వాత ప్రేక్షకుల మైండ్‌ బ్లాంక్‌ అయింది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.

రణబాలి టీజర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌...

ఇటీవల విడుదలైన రణబాలి టీజర్‌ ఇప్పటి వరకు ప్రేక్షకులు ఊహించుకున్న సినిమాకు పూర్తి విభిన్నంగా ఉంది. చాలా మంది విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ యాంగిల్‌లో రణబాలి సినిమా ఉంటుందని కనీసం ఊహించలేదని అంటున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం కథ అంటే మరోలా ఊహించుకున్నామని, ఇలాంటి నేపథ్యం, మరీ ఇంత హింస, అంతటి కరువు పరిస్థితుల నేపథ్యంలో రణబాలి సినిమా ఉంటుందని భావించలేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. దర్శకుడు రాహుల్‌ టీజర్‌తో కచ్చితంగా సర్‌ప్రైజ్ చేశాడు. ప్రేక్షకులను మొదటి నుంచి సర్‌ప్రైజ్‌ చేస్తూ వస్తున్న రాహుల్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా సర్‌ప్రైజ్ చేశాడు. సినిమా సినిమాకు అతడి మేకింగ్‌ స్టైల్‌, అతడి టేకింగ్‌ మారుతూ ప్రేక్షకులను థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్ పెంచుతూ వస్తున్నాడు. కనుక రణబాలి సినిమా విజయ్‌ దేవరకొండ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సాంగ్‌..

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం సందర్భంగా 'రణబాలి' సినిమా నుంచి పాటను విడుదల చేసిన సమయంలో ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆ పాటను చూసి కొందరు కథను ఊహించుకున్నారు. కానీ ఏ ఒక్కరి ఊహకు అందకుండా కరువు నేపథ్యం, బ్రిటీషు కాలం నాటి పరిస్థితులతో సినిమా ను రూపొందించడం జరిగిందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. దర్శకుడు రాహుల్‌ ఈ కథ కోసం దాదాపుగా రెండున్నర ఏళ్ల పాటు గ్రౌండ్‌లో వర్క్ చేశాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది ఒక ఫ్రీడం ఫైటర్‌ కథ అన్నట్లుగా కాకుండా ప్రస్తుత తరం మర్చిపోతున్న చరిత్ర ను, జానపద కథలను మళ్లీ గుర్తు చేసే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజ జీవితంలో భార్య భర్తలు అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు అదనపు బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు.

రణబాలి రిలీజ్‌ పై ఆశలు..

గత ఏడాది కింగ్డమ్‌ సినిమాతో వచ్చి తీవ్రంగా నిరాశ పరచిన విజయ్‌ దేవరకొండ, అంతకు ముందు సినిమాలతోనూ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయాడు. అందుకే విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు సాలిడ్‌ కమర్షియల్‌ హిట్‌ ను ఆశిస్తున్నారు. ఆ హిట్‌ రణబాలి సినిమాతో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ లుక్‌తో పాటు అన్ని విషయాల్లోనూ రణబాలి కి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. అందుకే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్‌ దేవరకొండ మార్క్‌ సినిమాలా కాకుండా 'రణబాలి' పూర్తి విభిన్నంగా ఉంటుందని, మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ మూవీ అనిపించుకోవడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మరి వారికి ఈ సినిమా ఏ మేరకు లాభాలు తెచ్చి పెడుతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News