రానా కూల్‌గా తప్పించుకున్నాడు..!

సోషల్‌ మీడియాలో కమల్‌కి వ్యతిరేకంగా పెద్ద యుద్దమే జరుగుతోంది. ఆ విషయమై కన్నడ రాష్ట్రం మొత్తం ఏకం అయింది.;

Update: 2025-06-05 15:28 GMT

కమల్‌ హాసన్‌ తన 'థగ్‌ లైఫ్‌' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తమిళ భాష నుంచి కన్నడ భాష వచ్చిందని వ్యాఖ్యలు చేశాడు, ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కమల్‌ హాసన్‌ అనుకోకుండా ఆ మాట అని ఉండవచ్చు అని అంతా అంటున్నారు. ఆ మాటలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. పొరపాటున అన్న ఆ వ్యాఖ్యలను కమల్‌ హాసన్ వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణ చెప్పాలంటూ కన్నడీగులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కమల్‌కి వ్యతిరేకంగా పెద్ద యుద్దమే జరుగుతోంది. ఆ విషయమై కన్నడ రాష్ట్రం మొత్తం ఏకం అయింది.

కన్నడంలో కమల్‌ హాసన్ థగ్‌ లైఫ్‌ సినిమాను విడుదల కానివ్వలేదు. కర్ణాటకలో సినిమా విడుదల కాకున్నా పర్వాలేదు కానీ తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదు అంటూ కమల్‌ హాసన్ తేల్చి చెప్పాడు. సినిమా కోసం క్షమాపణ చెప్పను అంటూ కమల్‌ చెప్పడంతో కర్ణాటకలో థగ్‌ లైఫ్‌ సినిమాను విడుదల కానివ్వలేదు. ఈ విషయం గురించి సెలబ్రెటీలు ఆచితూచి మాట్లాడుతున్నారు. కమల్‌కి కొందరు తమిళ ఇండస్ట్రీకి చెందిన వారు సపోర్ట్‌ చేస్తూ ఉంటే, కమల్‌ రాజకీయాల కోసం అలాంటి వ్యాఖ్యలు చేశాడని కొందరు విమర్శలు చేస్తున్నాడు. ఈ విషయం పట్ల తెలుగు హీరోలు మాత్రం మాట్లాడేందుకు భయపడుతున్నారు. దాంతో సున్నితంగా, తెలివిగా సమాధానం దాటవేస్తున్నారు.

ఇటీవల తెలుగు హీరో రానా ఒక చిట్‌ చాట్‌లో ఈ విషయం గురించి స్పందించాల్సి వచ్చింది. కన్నడంలో థగ్‌ లైఫ్‌ను బ్యాన్‌ చేయడం, కమల్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం వంటి కారణాల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మీద ఉండే ప్రభావం గురించి రానాను ప్రశ్నించిన సమయంలో ఆయన కూల్‌గా సమాధానంను చెప్పకుండా తప్పించుకున్నాడు. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా రానా మాట్లాడుతూ ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పరిధి విపరీతంగా పెరిగింది. కనుక ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి అని మాత్రం రానా చెప్పి, అసలు విషయాన్ని గురించి స్పందించకుండా తప్పించుకున్నాడు.

కమల్‌ హాసన్ వ్యాఖ్యల కారణంగా కర్ణాటక మొత్తం ఏకం అయింది. తమ భాషను చిన్న చూపు చూసి మాట్లాడాడు అంటూ కమల్‌ హాసన్‌ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అంతే కాకుండా ముందు ముందు రోజుల్లోనూ కమల్‌ సినిమాలు కన్నడంలో ఆడవు అని తేల్చి చెప్పారు. కమల్‌ ఇది కేవలం వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అన్నాడు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అన్ని భాషల వారు స్పందిస్తూ ఉన్నారు. కొందరు కమల్‌కి మద్దతు తెలుపుతూ ఉంటే, కొందరు మాత్రం కమల్‌ని విమర్శిస్తున్నారు. సెలబ్రెటీలు మాత్రం రిస్క్‌ ఎందుకు అని జాగ్రత్తగా ఈ విషయం గురించి న్యూట్రల్‌గా ఉంటున్నారు.

Tags:    

Similar News