కాంత‌లో ఇంట్రెస్టింగ్ రోల్ లో రానా

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంత సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ల‌క్కీ భాస్క‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్ప‌డింది.;

Update: 2025-06-21 15:30 GMT

సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ మీడియా, వేఫేర‌ర్ ఫిల్మ్స్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి నిర్మిస్తోన్న సినిమా కాంత‌. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా, భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సముద్ర‌ఖ‌ని కాంత‌లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 1950 మ‌ద్రాస్ నేప‌థ్యంలో కాంత సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు డైరెక్టర్ సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంత సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ల‌క్కీ భాస్క‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్ప‌డింది. దానికి తోడు ఈ సినిమాలో రానా కీల‌క పాత్ర పోషిస్తూ నిర్మిస్తుండ‌టంతో కాంత సినిమాకు మొద‌టి నుంచే మంచి బ‌జ్ నెల‌కొంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి త్వ‌ర‌లోనే టీజ‌ర్ రాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌ల్టీ లింగ్యువ‌ల్ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా మ‌ల్టీ స్టార‌ర్ గా రూపొందుతుంది. పీరియాడిక్ జాన‌ర్ లో రాబోతున్న కాంత‌లో రానా పాత్ర‌కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. కాంత సినిమాలో రానా ద‌గ్గుబాటి డిటెక్టివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, మ‌రో హీరోగా దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌బోతున్నాడు. భాగ్య శ్రీ బోర్సే దుల్క‌ర్ కు జోడీగా న‌టిస్తోంది.

క‌థల ఎంపిక విష‌యంలో కొత్త‌గా ఆలోచించే రానా, దుల్క‌ర్ ఇద్ద‌రూ క‌లిసి మొద‌టిసారి న‌టిస్తూ, నిర్మిస్తున్న ప్రాజెక్టు కావ‌డంతో కాంత సినిమాపై అంద‌రికీ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్ ను రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టనున్న చిత్ర యూనిట్ ఇప్ప‌టికే కాంత‌ను ఆగ‌స్ట్ 1వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News