ద‌గ్గుబాటి రానా సంప‌ద‌లు ఆర్జ‌న విలువ‌?

ఇక‌ 2.73కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్‌-క్లాస్, అలానే 1.32కోట్ల విలువ చేసే బీఎండ‌బ్ల్యూ 7 సిరీస్ కార్ అత‌డి సొంతం.;

Update: 2025-06-28 21:30 GMT

రానా ద‌గ్గుబాటి.. టాలీవుడ్ లో రేర్ ట్యాలెంట్. న‌టుడు.. నిర్మాత.. స్టూడియో య‌జ‌మాని.. హోస్ట్.. క్రియేట‌ర్.. పరోప‌కారి.. ఇలా విభిన్న కోణాల్లో అత‌డిని చూడొచ్చు. అత‌డు ఇప్ప‌టికే 15 సంవ‌త్స‌రాల కెరీర్ ని పూర్తి చేసాడు. ఇన్నేళ్ల‌లో రానా సంపాద‌న ఎంత ఉంటుంది? అంటే సినిమాలు, బుల్లితెర హోస్టింగ్ స‌హా ప‌లు వ్యాపార మార్గాల ద్వారా అత‌డు సుమారు 150 కోట్లు పైగా ఇండివిడ్యువ‌ల్ గానే సంపాదించాడ‌ని ఒక అంచ‌నా.

లెజెండ‌రీ తాత ద‌గ్గుబాటి రామానాయుడు సంపాదించిన‌ది.. డాడ్, అగ్ర‌నిర్మాత‌ డి.సురేష్ బాబు సంపాదించిన‌ది అత‌డు వృధా చేయ‌లేదు. వారు ఇచ్చిన వంద‌ల కోట్ల ఆస్తుల‌కు త‌న సంపాద‌న‌ను అద‌నంగా జోడించాడు. ఇప్ప‌టికి రానా పేరున ఏకంగా 150 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయిని టాక్ వినిపిస్తోంది. ఒక గొప్ప కుటుంబ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చి ఈ స్థాయికి ఎదిగాడు అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల సినిమాల ప‌రంగా స్లో అయిన రానా త‌న బాబాయ్ విక్టరీ వెంక‌టేష్‌తో క‌లిసి `రానా నాయుడు సీజ‌న్ 2` సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక‌పోతే రానా ఏడాదికి రూ.6-8 కోట్ల మినిమం వార్షికాదాయం ఆర్జిస్తున్నాడ‌నేది ఒక స‌ర్వే. అత‌డు అంత‌కంత‌కు త‌న ఆదాయ మార్గాల్ని పెంచుకుంటున్నాడు. వ్యాపారాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఆర్జ‌న పెంచుకుంటున్నాడు. 2010లో `లీడ‌ర్` చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఈ ప‌దిహేనేళ్ల‌లో అత‌డు సాధించిన ఘ‌న‌త ఇది.

సొంత ఇల్లు, ల‌గ్జ‌రీ కార్లు అత‌డి సొంతం. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో 45 కోట్ల ఖ‌రీదైన‌ సొంత ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఒక సెక్ష‌న్ ని ఇటీవ‌ల రెస్టారెంట్ గా కూడా మార్చార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక‌ 2.73కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్‌-క్లాస్, అలానే 1.32కోట్ల విలువ చేసే బీఎండ‌బ్ల్యూ 7 సిరీస్ కార్ అత‌డి సొంతం. అత‌డు వాడే వాచ్ ల ఖ‌రీదు ల‌క్ష‌ల్లోనే. హ్యూబ్లోట్ మెక్సిక‌న్ బ్రాండ్ వాచ్ ఖ‌రీదు 8.16ల‌క్ష‌లు.. అలాగే టీఏజీహ్యూర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ ఖ‌రీదు 3.25ల‌క్ష‌లు.. ఉంటుంది. అలాగే అత‌డి వ‌ద్ద ఖ‌రీదైన వ‌స్తువులు ఇంకెన్నో ఉన్నాయి.

రానా త‌న ఫిలింన‌గ‌ర్ ఇంట్లోనే బాల్యం అంతా గ‌డిపాడు. ఇక ఈ ఇంటిలో ప్రారంభించిన రెస్టారెంట్ డిజైన‌ర్ లుక్ తో ఎంతో శోభాయ‌మానంగా ఉంటుంది. ఆశ్రిత దగ్గుబాటి యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినిటీ ప్లాటర్‌లో షేర్ చేసిన పాత‌ వీడియోలో, రానా తన బాల్యంలోని కొన్ని అంద‌మైన‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ ఇంటికి సంబంధించిన‌ చాలా వివ‌రాలు అందించిన సంగ‌తి తెలిసిందే. ఇక రానాకు హైదరాబాద్‌తో పాటు, ఈ రెస్టారెంట్‌కు గోవాలో మరొక శాఖ ఉంది.

తాత నుంచి వార‌స‌త్వ సంప‌ద‌?

మ‌రోవైపు రానా తండ్రి ద‌గ్గుబాటి సురేష్ బాబు, తాత రామానాయుడు ద్వారా భారీ ఆస్తులు సంక్ర‌మించ‌నున్నాయి. వీటి విలువ వేల కోట్లు అనే టాక్ ఉంది. వీటిలో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్, నాన‌క్ రామ్ గూడ స్టూడియోస్ (రియ‌ల్ వెంచ‌ర్లు ఇక్క‌డ ప్లాన్ చేసార‌ని టాక్ వ‌చ్చింది), అలాగే సొంత థియేట‌ర్లు, భారీగా హైద‌రాబాద్ ఔట‌ర్ లో స్థ‌లాలు, విశాఖ‌లో ఆస్తులు, ప‌లు రియ‌ల్ వెంచ‌ర్ల‌లో అపార్ట్ మెంట్లు వ‌గైరా సంప‌ద‌ల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News