మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిన శివగామి
బాహుబలి తర్వాత రమ్యకృష్ణ మరింత పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు.;
అందానికి అందం, అభినయానికి అభినయం ఉన్న నటీమణుల్లో రమ్యకృష్ణ కూడా ఒకరు. సౌత్ ఎవర్‌గ్రీన్ హీరోయిన్ గా ఆమె అందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 55 ఏళ్ల వయసులో కూడా రమ్యకృష్ణ మరింత అందంగా కనిపిస్తూ, మంచి స్టార్‌డమ్ తో కెరీర్లో ముందుకెళ్తున్నారంటే అది అనుకున్నంత చిన్న విషయమేమీ కాదు. మామూలుగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఎక్కువ కెరీర్ ఉండదంటుంటారు. కానీ రమ్యకృష్ణ దాన్ని తప్పని నిరూపించారు. నిరూపిస్తూనే వస్తున్నారు.
బాహుబలితో మరింత పాపులర్
బాహుబలి తర్వాత రమ్యకృష్ణ మరింత పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. తన మార్కెట్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ చాలా సెలెక్టివ్ గా సినిమాను ఎంచుకుంటూ వస్తుండగా, ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసినట్టు కన్ఫర్మ్ అయింది.
దుల్కర్- పూజా హెగ్డే జోడీగా సినిమా
రీసెంట్ గా కొత్త లోక సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ ను అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో దసరా, ది ప్యారడైజ్ నిర్మాతలు SLV సినిమాస్ ఇటీవలే ఓ తెలుగు సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో దుల్కర్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసి, ఆ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.
దుల్కర్ సల్మాన్ కెరీర్లో 41వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి హైప్ ఏర్పడగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా నటించనున్నారని తెలుపుతూ ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో నటించనున్నారనే విషయాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.