కృష్ణవంశీతో రిలేషన్షిప్ గురించి రమ్యకృష్ణ..

ఈ విషయాలు తెలుసుకుంటే ఏ వైవాహిక జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడవు. నిజానికి ఒక బంధం ఏర్పడింది అంటే ఆ బంధంలో గొడవలు సహజంగా ఉంటాయి.;

Update: 2025-10-28 12:09 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రమ్యకృష్ణ.. సినిమాల ద్వారా ఎంత క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా.. విలన్ గా.. రాజమాతగా ఇలా పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా.. అందుకే ఎంతటి బరువైన పాత్రలను కూడా అవలీలగా మోస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా తన తోటి నటుడు, ప్రముఖ హీరో జగపతిబాబు హోస్టుగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది రమ్యకృష్ణ. ఇందులో తన భర్త, ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీతో రిలేషన్షిప్ గురించి స్పందించింది. మరి రమ్యకృష్ణ తన భర్త గురించి ఏం చెప్పింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

రమ్యకృష్ణ మాట్లాడుతూ.." బంధం అన్న తర్వాత గొడవలు సహజం.. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవైనా సరే ఇట్టే క్షణాల్లో మాయమవుతుంది. మేము కూడా చాలాసార్లు గొడవపడ్డాము. కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా కొనసాగడం నేర్చుకున్నాము. మా ఇద్దరికీ బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. మమ్మల్ని మా బంధమే కలిపి ఉంచింది. వివాహం అనేది పరిపూర్ణమైన ప్రేమ గురించి కాదు.. సహనం, కలిసి పెరగడం గురించి..

ఈ విషయాలు తెలుసుకుంటే ఏ వైవాహిక జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడవు. నిజానికి ఒక బంధం ఏర్పడింది అంటే ఆ బంధంలో గొడవలు సహజంగా ఉంటాయి. దీనిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు" అంటూ తన రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చింది మొత్తానికైతే ఇద్దరు ఒక అండర్ స్టాండింగ్ తోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటూ రమ్యకృష్ణ తెలిపింది.

రమ్యకృష్ణ - కృష్ణవంశీల పెళ్లి విషయానికొస్తే.. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 1998లో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ సినిమా ద్వారానే వీరి పరిచయం ఏర్పడింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. ఇందులో రమ్యకృష్ణ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. 2003 జూన్ 12న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.

కృష్ణవంశీ విషయానికి వస్తే..పసుపులేటి వెంకట బంగార్రాజుగా జన్మించిన ఈయన వృత్తిపరంగా కృష్ణవంశీగా పేరు సొంతం చేసుకున్నారు. తెలుగు స్క్రీన్ రైటర్ గా.. నిర్మాతగా.. దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. తన 30 ఏళ్ల సినీ కెరియర్లో మూడు నేషనల్ అవార్డులు , 9 నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకున్నారు.

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ను ఆరంభించి.. ఆ తర్వాత 1995లో వచ్చిన రొమాంటిక్ క్రైమ్ చిత్రం గులాబీ తో దర్శకుడిగా మారారు. నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, ఖడ్గం, డేంజర్ , చంద్రలేఖ, అంతఃపురం, మురారి, ఖడ్గం ఇలా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి.. స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా రంగమార్తాండ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.



Full View


Tags:    

Similar News