రామ్‌ ఫ్యాన్స్ కి ఆ ముచ్చట తీరనుందా...?

ఇలాంటి సమయంలో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో మళ్లీ సినిమా అనడంతో ఫ్యాన్స్ లో కాస్త నమ్మకం కనిపిస్తుంది.

Update: 2024-05-08 06:36 GMT

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత రామ్‌ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఇలాంటి సమయంలో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో మళ్లీ సినిమా అనడంతో ఫ్యాన్స్ లో కాస్త నమ్మకం కనిపిస్తుంది.

హిట్‌ మూవీకి సీక్వెల్‌ అవ్వడం వల్ల డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే త్వరలోనే రామ్‌ ను సరికొత్త ప్లాట్‌ ఫామ్‌ పై చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో వెబ్‌ సిరీస్‌ లకు ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగానే రామ్‌ తో నెట్‌ ఫ్లిక్స్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారట. కథ నచ్చితే వెబ్‌ కంటెంట్‌ లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా రామ్‌ హింట్‌ ఇచ్చాడట.

దాంతో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులను నెట్‌ ఫ్లిక్స్ ప్రతినిధులు రామ్‌ వద్దకు కథలతో పంపించారు అంటూ సమాచారం అందుతోంది. ఆ కథల్లో ఏ ఒక్క కథ కు రామ్‌ ఓకే చెప్పినా కూడా త్వరలోనే రామ్‌ ను ఓటీటీ ప్లాట్‌ ఫామ్ పై వెబ్‌ సిరీస్‌ లో చూసే అవకాశం ఉందని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more!

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు వెబ్‌ కంటెంట్‌ లో సందడి చేశారు. కొన్నాళ్లుగా రామ్‌ ఫ్యాన్స్ కూడా ఆయన్ను వెబ్‌ సిరీస్‌ ల్లో లేదా ఏదైనా ఓటీటీ షో లో చూడాలని ఆశ పడుతున్నారు. ఆ ముచ్చట దీంతో తీరడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్ సినిమాల ఎంపిక నిర్ణయం లో నిర్మాత స్రవంతి రవి కిషోర్ కీలకంగా వ్యవహరిస్తారు. ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు. రామ్‌ కెరీర్‌ పరంగా ఈ మధ్య కాలంలో కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కనుక వెబ్‌ సిరీస్ ఎంట్రీ మంచి నిర్ణయమే అనేది కొందరి అభిప్రాయం.

టాలీవుడ్‌ కి చెందిన వెంకటేష్‌, రానా, నాగ చైతన్య మరి కొందరు యంగ్‌స్టర్స్‌ వెబ్‌ సిరీస్ ల్లో నటించారు. మరి కొందరు మంచి కథల కోసం ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ లో ఇప్పటికే చాలా మంది ఓటీటీ కంటెంట్‌ లో నటించారు. టాలీవుడ్‌ లో కూడా ఆ పద్దతి కొనసాగబోతుంది.

Tags:    

Similar News