తారక్-చరణ్ రంగంలోకి ఒకేసారి!
టాలీవుడ్ బిగ్ స్టార్స్ రామ్ చరణ్-ఎన్టీఆర్ నిన్నటి వరకూ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. చరణ్ నటిస్తోన్న `పెద్ది`, తారక్ నటిస్తోన్న కొత్త చిత్రాలు రెండు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో తారలిద్దరు విరామంలో కొనసాగారు.;
టాలీవుడ్ బిగ్ స్టార్స్ రామ్ చరణ్-ఎన్టీఆర్ నిన్నటి వరకూ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. చరణ్ నటిస్తోన్న `పెద్ది`, తారక్ నటిస్తోన్న కొత్త చిత్రాలు రెండు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో తారలిద్దరు విరామంలో కొనసాగారు. దీంతో ఆ రెండు చిత్రాలకు సంబంధించి ఎలాంటి హడావుడి ఈ మధ్య కాలంలో నెట్టింట చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో హీరోలిద్దరు ఒకేసారి షూటింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రెండు సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. దీంతో ఆర్ ఎఫ్ సీ అంతా సందడి వాతావరణం అలుముకుంది. `పెద్ది`కి సంబంధించి ఇది కీలకమైన షెడ్యూల్.
జనవరికి ముగించేస్తారా?
ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా షెడ్యూల్ పూర్తి చేసి రాజధాని ఢిల్లీలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో వీలైనంత వేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని బుచ్చిబాబు అండ్ కో పనిచేస్తోంది. జనవరి కల్లా టాకీ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలు కూడా పూర్తి చేయాల్సి ఉందిట.
ఏక కాలంలో రెండు పనులు:
చరణ్ పై యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయని..వాటికోసం చరణ్ బ్యాకెండ్ ఎంతో వర్క్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అలాగే చరణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు వెల్లడించారు. మ్యూజిక్ స్కోరింగ్, ఎడిటింగ్ కి సంబంధించిన వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయినంత వరకూ వెంట వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. మార్చిలో రిలీజ్ తేదీ ఇచ్చిన నేపథ్యంలో టీమ్ ఇలా పరుగుల పెడుతున్నట్లు తెలుస్తోంది.
న్యూలుక్ లో తారక్ సెట్స్ కు:
అలాగే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న షూటింగ్ కూడా ఈరోజు నుంచే రామోజీ ఫిలిం సిటీలో తిరిగి ప్రారంభమైంది. కొత్త షెడ్యూల్ లో తారక్ న్యూలుక్ తో అటెండ్ అవుతున్నాడు. రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో తారక్ మరింత స్లిమ్ గా మారాడు. ఇప్పుడా శరీరాకృతిలో తారక్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో చాలా భాగం షూటింగ్ అంతా నైట్ టైమ్ జరుగుతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. తారక్ ఎముకులు కొరికే చలిలో చొక్కా విప్పి నటించాల్సిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయని వార్తలొస్తున్నాయి.
స్పెషల్ సాంగ్ ప్లానింగ్:
దీనికి సంబంధించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి. అలాగే సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ కూడా ఉంటుందం టున్నారు. సాధారణంగా పాటలకు..ఐటం పాటలకు ప్రశాంత్ నీల్ దూరంగా ఉంటాడు. కేవలం కథను..పాత్రలను మాత్రమే హైలైట్ చేయడం అతడి ప్రత్యేకత. కానీ ఈసారి మాత్రం ఊపు తెచ్చే ఐంట పాట కూడా ఉంటుందని బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ పాటను కూడా ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారుట. ఫేమస్ బ్యూటీని రంగంలోకి దించి హడావుడిగా చుట్టేయడం కాకుండా ఎక్కువ సమయం కేటాయించి సాంగ్ షూట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇదే నిజమైతే? నీల్ కూడా అసలైన కమర్శియల్ మార్గాన్ని ఎంచుకున్నట్లే.