పిక్‌ టాక్ : చరణ్‌, కియారా 'జరగండి జరగండి’

మెగా ఫ్యాన్స్ కి రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా కానుకగా విడుదల అయిన ఈ పాటలో చరణ్ తో పాటు హీరోయిన్‌ కియారా అద్వానీ విజువల్స్ ను కూడా చూడవచ్చు.

Update: 2024-03-27 12:08 GMT

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న గేమ్‌ చేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి అంటూ పాట విడుదల అయిన విషయం తెల్సిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతాన్ని అందించాడు.

 

మెగా ఫ్యాన్స్ కి రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా కానుకగా విడుదల అయిన ఈ పాటలో చరణ్ తో పాటు హీరోయిన్‌ కియారా అద్వానీ విజువల్స్ ను కూడా చూడవచ్చు. శంకర్‌ మార్క్‌ తో భారీ తనం కొట్టొచ్చినట్లు కనిపించేలా ఈ పాటను రూపొందించారు.

రామ్‌ చరణ్‌ మరియు కియారా అద్వానీ గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు గేమ్‌ చేంజర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. బాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్ గా ఉన్న కియారా అద్వానీ ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే కియారా అద్వానీ యొక్క వివాహం జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి అయినా కూడా కియారా అద్వానీ కి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. గేమ్‌ చేంజర్‌ తర్వాత వెంటనే మరో తెలుగు సినిమా కూడా ఈమె చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Tags:    

Similar News