సన్నీ లియోన్ సూపర్ మామ్ స్టంట్!

తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ పిల్లలతో కలిసి ఇంటివద్దే పండుగలను జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Update: 2026-10-31 14:30 GMT

గ్లామర్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తెరపై ఎంత బోల్డ్‌గా గ్లామరస్‌గా కనిపిస్తారో? నిజ జీవితంలో మాత్రం అంకితభావం గల మంచి తల్లి. పిల్లల పట్ల స‌న్ని చూపించే ప్రేమ, వారి సంతోషం కోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. తాజాగా హలోవీన్ పండుగను పురస్కరించుకుని స‌న్నీ లియోన్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రముఖులు పెద్ద పెద్ద క్లబ్‌లలో లేదా కాస్ట్లీ హోటళ్లలో పార్టీలు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ సన్నీ లియోన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచించారు.

తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ పిల్లలతో కలిసి ఇంటివద్దే పండుగలను జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ ఏడాది హలోవీన్ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక స్కేర్‌ఫెస్ట్ పార్టీని హోస్ట్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలని భయపెట్టే దెయ్యాల వేషాలు.. భయానక వాతావరణం.. విచిత్రమైన మాస్క్‌లు ..ప్రత్యేకమైన డెకరేషన్‌తో ఇల్లును ఒక హంటెడ్ హౌస్‌లా మార్చేసినట్లు సంతోషంగా పంచుకున్నారు.

ముఖ్యంగా ఈ వేడుకల కోసం తన పిల్లలతో కలిసి కూర్చుని స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం.. ఇంటిని అలంకరించడం వంటి పనులలో స‌న్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి సాధారణ తల్లిలా ముగ్గురు పిల్లలు నిషా కౌర్, అషర్, నోవా లతో కలిసి చేసిన హలోవీన్ హంగామా ఎంతో మధురమైన అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. పిల్లల ముఖంలో చిరునవ్వు చూడటం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని.. పండుగలు కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాకుండా పిల్లలతో గడిపే అరుదైన క్షణాలని అభివర్ణించారు.

బిజీ షెడ్యూల్స్ మధ్య షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా? మాతృత్వానికి ..కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే సన్నీ లియోన్ తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గ్లామరస్ స్టార్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూనే.. మరోవైపు చక్కటి కుటుంబ జీవితాన్ని నిర్వహిస్తున్న తీరు స‌న్ని వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. పిల్లల ఆనందం కోసం ఇంట్లోనే అద్భుతమైన స్కేర్‌ఫెస్ట్ పార్టీని నిర్వహించి సన్నీ లియోన్ మరోసారి సూపర్ మామ్ అని నిరూపించుకున్నారు.

Tags:    

Similar News