నేను తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదో నా మేనేజర్‌ను పట్టుకొని అడగండి: రకుల్

ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత అనుకోకుండా తెలుగు సినిమాల నుంచి మాయమైపోయింది.

Update: 2026-10-31 14:35 GMT

ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత అనుకోకుండా తెలుగు సినిమాల నుంచి మాయమైపోయింది. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ రామాయణంలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో రకుల్ తన తెలుగు సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలు చేసిన మీరు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదని రకుల్‌ను అడిగారు. దీనికి స్పందించిన రకుల్.. తాను కావాలని తెలుగు సినిమాలకు దూరం కాలేదని చెప్పుకొచ్చారు.

"నేను ఎప్పుడూ ఇలా ప్లాన్ చేయలేదు. ఒకప్పుడు ఇక్కడ వరుస సినిమాలు చేసేదాన్ని. కానీ ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆ తర్వాత ముంబాయికి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్నాను" అని రకుల్ తెలిపారు.

అయితే ఈ మధ్య తెలుగు సినిమాలను చాలా మిస్ అవుతున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించిన చాలా కథలు కూడా వింటున్నానని వెల్లడించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా.. బిర్యానీ అవన్నీ చూసి.. ఎంతో ఎగ్జైట్‌గా ఫీలయ్యానని రకుల్ అన్నారు.

"ఈ మధ్య తెలుగు సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. చాలా స్క్రిప్ట్స్ కూడా వింటున్నాను. ఇప్పుడు కూడా హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు చాలా ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాను" అని ఆమె చెప్పారు.

అంతేకాకుండా తన మేనేజర్ గురించి సరదాగా మాట్లాడుతూ.. "నా మేనేజర్ ఇక్కడ ఎక్కడ ఉంటాడో.. అతన్ని పట్టుకుని అడగండి ఎందుకు తెలుగు సినిమాలు చెయ్యడం లేదు అని" అంటూ నవ్వులు పూయించారు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ప్రార్థన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు.

కరోనా తర్వాత రకుల్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. హిందీ సినిమాలపై దృష్టి పెట్టడంతో టాలీవుడ్‌కు దూరమైనట్లు అయింది.

ఇప్పుడు రామాయణం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.




Tags:    

Similar News