• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలి సక్సెస్.....

బాహుబలి సక్సెస్.. బాలీవుడ్ నిర్మాతకు క్రెడిట్ ఇచ్చిన చరణ్

| ఇలాంటి సమయంలో ఊహించని విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ఈవెంట్ లో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి సక్సెస్ లో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు.

By - Tupaki Desk
Update: 2024-08-22 13:20 GMT

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్, సౌత్ సినీ అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సినిమాలను, స్టార్స్ ని, సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ పైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ఈవెంట్ లో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి సక్సెస్ లో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు.

బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్టామినా గురించి అందరికి తెలిసింది. ఈ సినిమాతో రాజమౌళి దర్శకుడిగా గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. డార్లింగ్ ప్రభాస్ కి కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం వలన హిందీలో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. సినిమా కంటెంట్ కూడా బాగుండడంతో పబ్లిక్ లోకి చాలా బలంగా వెళ్ళింది.

ఈ విధంగా చూసుకుంటే బాహుబలి సక్సెస్ క్రెడిట్ లో కచ్చితంగా నిర్మాత కరణ్ జోహార్ కి కూడా భాగం ఇవ్వాలనే మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. తాజాగా రామ్ చరణ్ మెల్ బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంలో ఓ విధంగా కరణ్ జోహార్ భాగస్వామ్యం కూడా ఉందని అన్నారు. బాహుబలి చిత్రాన్ని నార్త్ ఇండియాలో కరణ్ జోహార్ రిలీజ్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

బాహుబలి సినిమాని రాజమౌళి చాలా గొప్పగా తీశారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రభాస్ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. బాహుబలి సినిమాని కరణ్ జోహార్ కి చూపించడానికి రానా దగ్గుబాటి ముంబై వెళ్లడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అలాగే కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని చూసి హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా కరణ్ జోహార్ బాహుబలి సిరీస్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు రీచ్ రీచ్ అవ్వడానికి ఒక కారణమయ్యారు.

ఈ రోజు సౌత్ సినిమాల గురించి ప్రపంచ స్థాయిలో చర్చి నడుస్తుంది అంటే దానికి కరణ్ జోహార్ ఒక కారణమని రామ్ చరణ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రశంసించడం విశేషం. రామ్ చరణ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. రామ్ చరణ్ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఆయన నుంచి రాబోయే సినిమాలకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • RRR 
  • Gamechanger 
  • Ramcharan 
  • Karanjohar 
  • IndianFilmFestival 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS