చిరు శ్రీదేవి తర్వాత.. ఇప్పుడు చరణ్ జాన్వీ!
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'పెద్ది' టీమ్ తన నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టింది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంట చాలా ఫ్రెష్‌గా ఉండటంతో, వీళ్లిద్దరినీ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'పెద్ది' టీమ్ తన నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరూ కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ఒక చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ దగ్గర కనిపించారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలంక షెడ్యూల్ వెనుక అసలు ప్లాన్ ఏంటంటే, ఈ క్రేజీ పెయిర్‌పై ఒక బ్యూటిఫుల్ "మెలోడీ లవ్ సాంగ్"ను షూట్ చేయనున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే, ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఈ కాంబినేషన్‌పై ఒక ఇంట్రెస్టింగ్ పోలికను తెరపైకి తెచ్చాయి. ఒకప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన ఐకానిక్ పెయిర్.. మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి.
వాళ్లిద్దరూ కలిసి ఫారిన్ లొకేషన్లలో సాంగ్స్ లో క్రియేట్ చేసిన మ్యాజిక్, ఆ కెమిస్ట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు, చాలా ఏళ్ల తర్వాత, మరో మెగా హీరో రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ కోసం ఫారిన్ లొకేషన్‌కు వెళ్లడం చాలా స్పెషల్ ఫీలింగ్‌ను ఇస్తోంది.
ఇది ఒక అరుదైన కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 'పెద్ది' సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ మెలోడీ సాంగ్ విజువల్‌గా, మ్యూజికల్‌గా ఒక ట్రీట్‌లా ఉండబోతోందని అంచనాలు పెరిగిపోయాయి. 'విలేజ్ స్పోర్ట్స్ డ్రామా' అయినా, బుచ్చిబాబు ఈ సాంగ్‌ను ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేయడం చూస్తుంటే, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆనాటి చిరు శ్రీదేవి మ్యాజిక్‌ను, ఈనాటి చరణ్ జాన్వీ ఏ స్థాయిలో రిపీట్ చేస్తారే చూడాలి.