• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్​ ఛేంజర్​.. ఇదెక్కడి...

గేమ్​ ఛేంజర్​.. ఇదెక్కడి కన్ఫ్యూజన్ శంకరా..

| కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్​... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​తో ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్​ను మొదలు పెట్టారు

By - Tupaki Desk
Update: 2023-10-10 08:44 GMT

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్​... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​తో ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్​ను మొదలు పెట్టారు. కానీ మధ్యలో శంకర్​కు ఇండియన్ 2 షూటింగ్ కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి రావడంతో ఏడాదిన్నరగా.. రెండింటినీ బ్యాలెన్స్​ చేసుకుంటూ వస్తున్నారు.

అయితే ఈ మధ్యే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన విషయాలపై ఓ క్లారిటీ వచ్చినా.. గేమ్​ ఛేంజర్ షూటింగ్​, విడుదల తేదీపై స్పష్టత ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి ఈ మధ్యే.. ఇండియన్ 2 షూటింగ్ పూర్తై రిలీజ్ డేట్ కన్ఫామ్​ అయ్యాక.. ఇక గేమ్​ ఛేంజర్​కు కష్టాలు తప్పాయి అని అంతా అనుకున్నారు. ఇక శంకర్​ ఫోకస్ మొత్తం గేమ్​ ఛేంజర్​పైనే ఉంటుందని ఆశించారు.

అనుకున్నట్టే.. తాజాగా గేమ్​ ఛేంజర్​ లేటెస్ట్​ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. ఒకేసారి గచ్చిబౌలి, వికారాబాద్​లో రెండు చోట్ల సినిమా చిత్రీకరిస్తున్నారని తెలిసింది. దీంతో త్వరగా షూటింగ్ పూర్తవుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ ఓ సడెన్ ట్వీస్ట్ తెరపైకి వచ్చింది.

అదేంటంటే.. తాజాగా ఇండియన్ 2కు సంబంధించి డబ్బింగ్ థియేటర్​లో కమల్​ హాసన్​తో పాటు శంకర్ దర్శనమిచ్చారు. అంటే శంకర్​.. అక్కడ ఉంటే.. మరి ​గచ్చిబౌలి, వికారాబాద్​లో గేమ్​ ఛేంజర్ షూటింగ్ చేసేదెవరు? శంకర్​ లేకుండానే​ రామ్​చరణ్​పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారా? లేదంటే ఇండియన్​ 2 నుంచి విడుదలైన డబ్బింగ్ థియేటర్​ వీడియో పాతదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏదేమైనప్పటికీ చరణ్ ఫ్యాన్స్​ మాత్రం కాస్త బాధపడుతున్నారు. శంకర్​ లేకుండానే చరణ్​పై సన్నివేశాలను చిత్రీకరించడం, సినిమా ఔట్​ఫుట్​కు డ్యామేజ్​ అవొచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కొన్ని సీన్స్​ను ఇలానే శంకర్​ లేకుండా తెరకెక్కించారు. అసలే సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా శంకర్ లేకుండా షూట్ అవుతుందా అనే అనుమానాలు... ఫ్యాన్స్​ను కాస్త హర్ట్ చేస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ పూర్తవుతుందో?, రిలీజ్​ డేట్​ను ఎప్పుడు కన్ఫామ్ చేసుకుంటుందో..

Tags:    
  • Shankar 
  • Ramcharan 
  • Kiaranadvani 
  • Anjali 
  • Kamalhaasan 
  • Indian2movie 
  • Charan 
  • Buchibabu 
  • Filmindustry 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS