రామాయణ టీజర్ ట్రోల్స్ వెనుక బిజినెస్ స్ట్రాటజీ?

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణ` చిత్రం చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Update: 2026-07-04 18:27 GMT

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణ` చిత్రం చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలైన సినిమా గ్లిమ్స్, టీజర్ విజువల్స్.. విఎఫ్ఎక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేవంటూ నెటిజన్లు భారీగా ట్రోలింగ్ కు దిగారు. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు ఈ తరహా నాసిరకం గ్రాఫిక్స్ ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విమర్శలు నెగిటివిటీ వెనుక చిత్ర యూనిట్ కావాలనే ప్లాన్ చేసిన పక్కా బిజినెస్ స్ట్రాటజీ దాగి ఉందనే ఆరోప‌ణ‌ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, అనలిస్ట్ ధ్రువ పరీక్ష నెగిటివిటీ వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని విశ్లేషిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా ప్రమోషన్లలోనెగిటివ్ పబ్లిసిటీ కూడా ఒక పబ్లిసిటీనే అనే సూత్రాన్ని చిత్ర యూనిట్ తెలివిగా వాడుకుంటుంద‌న్నారు. టీజర్ విజువల్స్ పట్ల సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ జరిగితే? ఆ సినిమా పేరు అంతగా జనం మెదళ్లలోకి వెళ్తుందని తద్వారా సినిమాపై ఒక రకమైన క్యూరియాసిటీ జనరేట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భారీ నెగిటివ్ బజ్ వల్ల సినిమాకు ఊహించని రేంజ్‌లో ఉచిత పబ్లిసిటీ ద‌క్కుతుంద‌న్నారు.

పెద్ద సినిమా మార్కెట్ లోకి వచ్చేటప్పుడు ప్రేక్షకుల్లో తీవ్రమైన చర్చ జరగాలి. `రామాయణ` టీజర్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. విఎఫ్ఎక్స్ బాగున్నాయనే ప్రశంసల కంటే బాలేదనే విమర్శలే సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మేకర్స్, కావాలనే యావరేజ్ విజువల్ క్వాలిటీ ఉన్న అవుట్‌పుట్‌ను టీజర్‌గా వదిలారని ఇంకొంత మంది భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా గురించి తెలియని సామాన్య ప్రేక్షకుడికి కూడా రామాయణ అనే ఒక సినిమా వస్తోందనే విషయం బలంగా రిజిస్టర్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇదంతా ప్రీ-రిలీజ్ హైప్ కోసం వేసిన ఓ ముందస్తు ప్రణాళికే అనేది ఈ స్ట్రాటజీ ముఖ్య ఉద్దేశం అంటున్నారు.

ఈ నెగిటివిటీ స్ట్రాటజీ వెనుక మరో మైండ్ గేమ్ కూడా ఉందంటున్నారు. టీజర్ విజువల్స్ అధ్వాన్నంగా ఉన్నాయనే ఇంప్రెషన్ ప్రేక్షకుల్లో బలంగా పడిపోవడం వల్ల సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అడుగున పడిపోతాయి. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చేసరికి ట్రైలర్ లో అత్యుత్తమ విఎఫ్ఎక్స్ క్వాలిటీని చూపిస్తే ప్రేక్షకులు ఒక్కసారిగా థ్రిల్ అవుతారు. టీజర్ చూసి తక్కువ అంచనా వేసాం. కానీ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అనే పాజిటివ్ టాక్ థియేటర్లలో విపరీతంగా పని చేస్తుంది. ఈ విధంగా అంచనాలను తగ్గించి, ఆపై థియేటర్లలో సర్ ప్రైజ్ చేయడం ద్వారా భారీ వసూళ్లను రాబట్టవచ్చనేది చిత్ర యూనిట్ అసలు ప్లాన్ కావొచ్చు.

ఇలాంటి వినూత్న - సాహసోపేతమైన బిజినెస్ స్ట్రాటజీలు ఆధునిక సినిమా మార్కెటింగ్‌లో కొత్తేమీ కాదు. గతంలో కూడా కొన్ని పెద్ద చిత్రాలు ఇలాంటి నెగిటివ్ బజ్ సృష్టించుకుని ఆ తర్వాత కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇదే క‌రెక్ట్ అయితే? `రామాయణ` టీమ్ మొదటి అడుగులోనే సగం విజయం సాధించినట్లే లెక్క. ఎందుకంటే విమర్శల రూపంలోనే అయినా సినిమా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. మరి రాబోయే రోజుల్లో చిత్ర యూనిట్ ఈ నెగిటివిటీని ఎలా పాజిటివ్‌గా మార్చుకుంటుందో? అసలైన విజువల్ వండర్‌తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News