రామాయ‌ణం కొత్త ట్రైల‌ర్: రామ్ వ‌ర్సెస్ రావ‌ణ‌.. మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్ ట్రీట్

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ `రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్` నుంచి తాజాగా కొత్త ట్రైలర్ విడుదలైంది.

Update: 2026-10-15 16:30 GMT

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ `రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్` నుంచి తాజాగా కొత్త ట్రైలర్ విడుదలైంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తుండగా, యశ్ శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడి అరాచకాలను రాముడు ఎలా తిప్పికొట్టారనే ప్రధానాంశంతో కూడిన ఈ ట్రైలర్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సీతను ఎత్తుకెళ్లిన రావణుడిని వెతుక్కుంటూ శ్రీరాముడు సాగించే విరోచిత పోరాటాలు, రాక్షస సంహారం ఒకవైపు ఉంటే.. ముల్లోకాలను ఒకటే సామ్రాజ్యంగా పాలించాలని, దేవతలను తన కాలి కింద నలిపేయాలని చూసే పది తలల రావణాసురుడి అరాచక దండయాత్ర మరోవైపు ఈ ట్రైలర్‌లో చూపించారు. రామాయణ కథను విజువల్‌గా అసాధారణంగా మలిచేందుకు నితీశ్ - నమిత్ మల్హోత్రా బృందం ప్రాణం పెట్టేసిందని చెప్పవచ్చు.

గ్రాండియర్ ట్రీట్ అందించడం కోసం చిత్ర యూనిట్ వీఎఫ్ఎక్స్‌ను అత్యంత భారీ స్థాయిలో ఉపయోగించింది. ట్రైలర్ ఆద్యంతం రావణాసురుడి దండయాత్ర.. శ్రీరాముడి యుద్ధ నైపుణ్యంతో రసవత్తరంగా సాగింది. అంతేకాకుండా కుంభకర్ణుడు, జటాయువు సహా ఎన్నో పాత్రలు వచ్చి వెళుతూ ట్రైలర్‌కు అదనపు హంగులు తెచ్చాయి. దేవతలపై రావణుడి దండయాత్రను ప్రధానంగా హైలైట్ చేయగా.. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయిపల్లవి నటన అసమానంగా ఉంది. అలాగే పరశురాముని గ్లింప్స్ కూడా క్షణకాలం ఎంతో రక్తి కట్టించింది.

యుగయుగాలుగా దేవతలకు, అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలే విజయం సాధించారు. అయితే దేవతల అంతం చూడటానికి ఎగిసిన జ్వాలగా రావణుడి అరాచకాలు ఎలా ఉంటాయనేది తెరపైనే చూడాలి. ది ఒడిస్సీ, డ్యూన్, ఇంటర్ స్టెల్లార్ వంటి చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన విజువల్ ఆర్టిస్ట్స్ పనితనం ఈ సినిమాకు ఉంది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ ఎంతో గ్రాండ్‌గా అలరించి మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్‌ను అందించింది. లాజిక్కులు ఎక్కువ‌గా వెత‌క్క‌పోతే క‌చ్ఛితంగా ఈ ట్రైల‌ర్ అందరికీ న‌చ్చుతుంది. అవెంజ‌ర్స్, అవ‌తార్ త‌ర‌హాలో గ్రాండియ‌ర్ విజువ‌ల్ ట్రీట్ అందించాల‌నే ప్ర‌య‌త్నంగా మాత్ర‌మే దీనిని చూడాలి. పురాణేతిహాసం రామాయణ కాలాన్ని త‌వ్వి తీసి.. ఆరోజుల్లో రాముడు, సీత అంత సింపుల్ గా ఉండేవారు క‌దా! అని రంధ్రాన్వేష‌ణ‌లు చేస్తే ఇది పూర్తి అసంబ‌ద్ధంగా క‌నిపిస్తుంది. దీనిని ఒక క్రియేటివ్ ఫ్రీడ‌మ్ తో తీసిన సినిమాగా మాత్ర‌మే చూడాలి.

నమిత్ - నితీష్ జోడీ తలపెట్టిన ఈ విజువల్ గ్రాండియర్ డ్రీమ్ నిజంగానే అసాధారణంగా రూపుదిద్దుకుంటోంద‌న‌డానికి ఈ ట్రైల‌ర్ ఒక సాక్ష్యం. రామ్ వర్సెస్ రావణ్ పోరు నేపథ్యంలో సాగే ఈ అద్భుత దృశ్యకావ్యంపై ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణం పార్ట్ 1 సినిమా ఈ దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. దాదాపు 40 భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News