కోటి రూపాయలకు 1రూ అదనంగా డిమాండ్?
బిగ్ బీతో కలిసి పనిచేయాల్సి వస్తే ఆయన కంటే రూ. 1 అదనంగా రెమ్యూనరేషన్ తీసుకుంటానని నానా పటేకర్ కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకునేవారని సావంత్ వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణానంతరం పరిశ్రమలో ఆయన సృష్టించిన ఇంపాక్ట్.. వ్యక్తిత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో `దృశ్యం 3` చిత్ర నటుడు కమ్లేష్ సావంత్ ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ లెగసీని.. ఆయన పారితోషికం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ సినీ ప్రయాణం గురించి మాట్లాడిన కమ్లేష్ సావంత్ హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడితో కలిసి నటించేటప్పుడు నానా పటేకర్ ఓ వినూత్నమైన కండిషన్ పెట్టారనే విషయాన్ని పంచుకున్నారు.
బిగ్ బీతో కలిసి పనిచేయాల్సి వస్తే ఆయన కంటే రూ. 1 అదనంగా రెమ్యూనరేషన్ తీసుకుంటానని నానా పటేకర్ కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకునేవారని సావంత్ వెల్లడించారు. ఒక సినిమా కోసం అమితాబ్ బచ్చన్ కోటి పారితోషికం అందుకోగా.. నానా పటేకర్ 1 కోటి ఒక్క రూపాయి తీసుకున్నారట. ఇద్దరు కలిసి 1999లో మెహుల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `కోహ్రామ్` చిత్రంలో మాత్రమే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తనకు ఖచ్చితంగా తెలియదని.. కానీ పరిశ్రమలో ఇలాంటి కథనాలు బలంగా వినిపించేవన్నారు.
బాలీవుడ్లో డైలాగ్ డెలివరీ ఆధారంగా సినిమాల ట్రెండ్‌ను మార్చిన ఘనత నానా పటేకర్ కే దక్కుతుందని కమ్లేష్ సావంత్ కొనియాడారు. ఒకప్పుడు హిందీ చిత్రసీమ పూర్తిగా సంగీతం, డాన్స్ చుట్టూనే తిరిగేదని, కానీ ఆ ఫోకస్‌ను విలక్షణమైన సంభాషణల వైపు మళ్లించిన శకం నానా పటేకర్ తోనే ప్రారంభమైందని తెలిపారు. థియేటర్లలో నానా డైలాగ్ డెలివరీకి లభించిన ఆదరణ దగ్గరుండి చూశానని పేర్కొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నానా పటేకర్ మాట్లాడేటప్పుడు ప్రేక్షకులు పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించేవారని, ఆ హాల్ లో ఆయన సంభాషణలు వినడానికి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా వేచి చూసేవారని సావంత్ గుర్తుచేసుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి క్రేజ్, డైలాగ్ పవర్ సాధించిన కొద్దిమంది నటుల్లో నానా పటేకర్ అగ్రస్థానంలో ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఆ కాలంలో మిగతా స్టార్ హీరోలందరూ పద్ధతి ప్రకారం మాస్ .. ఫ్యామిలీ సినిమాల్లో నటిస్తుంటే? నానా పటేకర్ మాత్రం పూర్తి భిన్నమైన, రియలిస్టిక్ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన దారిని సృష్టించుకున్నారు. నటుడిగానే కాకుండా సమాజంలో అంశాలపై ఆయన మాట్లాడే తీరు.. ప్రదర్శించే నిజాయితీ ఆయనపై ప్రేక్షకుల్లో గౌరవాన్ని పెంచాయి. ముఖ్యంగా `క్రాంతివీర్` లాంటి చిత్రాల్లో నానా చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ సినీ ప్రేమికులకు గుర్తే. తెరపై ఆయన అరుస్తున్నా? నిశ్శబ్దంగా నటిస్తున్నా? ఆ ఎనర్జీ నేరుగా ప్రేక్షకులకు తాకుతుంది.
ఇలా వెండితెరపై తనకంటూ అసాధారణమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నానా పటేకర్ నటనతో ఎంతోమంది యువ నటులకు ఆదర్శంగా నిలిచారు. అమితాబ్ బచ్చన్‌తో ఆయనకు ఉన్న ఆరోగ్యకరమైన పోటీ, సినిమా పట్ల వారు చూపించిన అంకితభావం నాటి బాలీవుడ్ స్వర్ణయుగాన్ని తలపిస్తాయి. నేడు ఆయన భౌతికంగా నానా పటే కర్ లేకపోయినా? ఆయన పండించిన వైవిధ్యమైన పాత్రలు, సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ చిరస్మరణీయమే.