రామాయ‌ణం బ‌డ్జెట్ 1600 కోట్లు కాదు 4000 కోట్లు?

ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో నితీష్ తివారీ `రామాయ‌ణం` చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-15 04:08 GMT

ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో నితీష్ తివారీ 'రామాయ‌ణం' చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్, ల‌క్ష్మ‌ణుడిగా ర‌వి దూబే, సీత‌గా సాయిప‌ల్ల‌వి, ఆంజ‌నేయుడిగా సన్నీడియోల్, రావ‌ణుడిగా య‌ష్ న‌టిస్తున్నారు. ఈ సినిమాకి అసాధార‌ణ కాస్టింగ్ ప‌ని చేస్తోంది. తారాగ‌ణం అంత‌కంత‌కు పెరుగుతున్నారు. అదే స‌మ‌యంలో హాలీవుడ్ స్థాయిలో వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ కోసం బ‌డ్జెట్ ని కేటాయించారు న‌మిత్ మ‌ల్హోత్రా- య‌ష్ బృందం.

అయితే రామాయ‌ణం బ‌డ్జెట్ ఇంత అంత అంటూ చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. మొద‌ట రెండు భాగాల సిరీస్ కోసం దాదాపు 800కోట్లు పెడుతున్నార‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఆ త‌ర్వాత 1600 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌వుతోంద‌ని, మొద‌టి భాగానికి 900 కోట్లు, రెండో భాగానికి 700 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారని ప్ర‌చారం సాగించారు. కానీ ఇవ‌న్నీ కేవ‌లం మీడియా ఊహాగానాలు మాత్ర‌మేనని ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది.

తాజాగా ఓ మీడియా స‌మావేశంలో నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా రామాయ‌ణం బ‌డ్జెట్ గురించి వెల్ల‌డించారు. ఇది భార‌త‌దేశంలోనే అత్యంత ఖ‌రీదైన ఫ్రాంఛైజీ. రెండు భాగాల కోసం సుమారు 4000 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అన్నారు. జురాసిక్ పార్క్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఏ నాటికైనా భార‌త‌దేశం గ‌ర్వించే సినిమాని తీయాల‌ని తాను కోరుకున్న‌ట్టు న‌మిత్ మ‌ల్హోత్రా తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌నే ధ్యేయంతోనే పురాణేతిహాసం అయిన `రామ‌య‌ణం` క‌థ‌ను ఎంపిక చేసుకున్నామ‌ని అన్నారు. ఈ సినిమాకి కావాల్సినంత బ‌డ్జెట్ ని తాము స్వ‌యంగా స‌మ‌కూరుస్తున్నామ‌ని, బ‌య‌టి నుంచి నిధుల‌ తేవ‌డం లేద‌ని కూడా క్లారిటీనిచ్చారు.

4000 కోట్లు అంటే సుమారు 500 మిలియ‌న్ డాల‌ర్ల‌తో స‌మానం. ఇది ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే త‌క్కువే... కానీ క్వాలిటీ హాలీవుడ్ రేంజుకు ఎంత‌మాత్రం త‌గ్గ‌ద‌ని నిర్మాత‌ న‌మిత్ మ‌ల్హోత్రా భ‌రోసానిచ్చారు. మేమే స్వ‌యంగా దీనికి నిధులు స‌మ‌కూరుస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. హోస్ట్ ప్రఖార్ గుప్తాతో చ‌ర్చ‌లో ప్రైమ్ ఫోకస్ CEO .. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ , డ్యూన్ వంటి అనేక హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ల వెనుక ఉన్న శక్తి అయిన నమిత్ మల్హోత్రా `రామాయణం` డీటెయిల్స్ ని వెల్లడించారు. న‌మిత్ తో క‌లిసి కేజీఎఫ్ య‌ష్ ఈ చిత్రానికి పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తున్నారు.

Tags:    

Similar News