'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్.. వేరే లెవెల్ లో ఉందిగా!

రామాయణ మహా కావ్యం ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-03 08:10 GMT

రామాయణ మహా కావ్యం ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ నటుడు యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

Full View

వారితోపాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని పలువురు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాను రెండు భాగాల్లో తీస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేస్తామని.. 2027 దీపావళికి రెండో భాగాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.


మొదటి పార్ట్‌ షూటింగ్‌ ఇప్పటికే కంప్లీట్‌ అయినట్లు తెలుస్తోంది. మేకర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోస్ రీసెంట్ గా వైరల్ గా మారాయి. వాటితోపాటు సెట్స్ నుంచి లీక్ పిక్స్ కూడా మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. వేరే లెవెల్ హోప్స్ పెట్టుకుని.. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినట్లు.. మేకర్స్ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. "కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిమూర్తులు ముల్లోకాలను పాలిస్తున్నారు. బ్రహ్మ.. సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు, శివుడు.. అంతం చేయగలిగే దేవుడు.. కానీ వారి సృష్టించిన మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం మొదలైంది. సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలు ఆరాధించేది. . ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ" అంటూ మేకర్స్ గ్లింప్స్ లో రివీల్ చేశారు.

రాముడిగా రణబీర్, రావణుడిగా యష్ , సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రణబీర్, యష్ లపై చూపించిన విజువల్స్ అయితే వేరే లెవెల్.. మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి.

రణబీర్, యష్ ను చూపించిన ఫ్రేమ్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మొత్తానికి గ్లింప్స్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా నయా ఎక్స్పీరియన్స్ అందించనుందని క్లియర్ గా తెలుస్తోందని అంటున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లో మూవీ ఉండనున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. మరి రామాయణ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News