పవన్ కళ్యాణ్.. 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ క్రేజీ కాంబినేషన్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-09-07 19:31 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ ఫ్యాన్స్ ఫోకస్ OG పైనే ఉంది. అలాగే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి క్రేజ్ అందుకునే అవకాశం ఉంది. ఈ సినిమాపై పాజిటివ్ హైప్ క్తియేట్ అయ్యేలా మేకర్స్ ఓ ప్లాన్ తోనే వెళుతున్నారు.

ఇక OG దాదాపు కంప్లీట్ అవుతుండగా, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రీసెంట్ షెడ్యూల్‌లో పవన్ సెట్స్‌లో పాల్గొనడంతో పాటు, ఒక స్టైలిష్ డాన్స్ నంబర్ కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. డీఎస్పీ ఎప్పుడూ పవన్ సినిమాలకు ప్రత్యేకమైన మాస్ బీట్‌లను ఇస్తాడనే నమ్మకం ఉంది. కానీ ఈసారి మాత్రం ఆల్బమ్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ ఉండబోతోందని టాక్ వస్తోంది. అదే రమణ గోగుల రీ ఎంట్రీ. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్, రమణ గోగుల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే వార్త ఫ్యాన్స్‌ని ఫుల్ హ్యాపీ చేసింది.

తమ్ముడు, బద్రీ, జానీ, అన్నవరం లాంటి సినిమాలకు రమణ ఇచ్చిన పాటలు అప్పట్లో యూత్‌ని షేక్ చేశాయి. ఆయన వాయిస్ పవన్ ఇమేజ్‌కి స్పెషల్ ఎనర్జీ ఇచ్చిందని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పుడు అదే కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్లో కనిపిస్తే, ఆడియోలో మరోసారి మాజిక్ రిపీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఇటీవల రమణ గోగుల గోదారి గట్టు సాంగ్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ పాట పెద్ద హిట్ కావడంతో ఆయన వాయిస్‌కి మళ్లీ డిమాండ్ పెరిగింది. దాంతో హరీష్ శంకర్, డీఎస్పీ టీమ్ కలసి రమణ గోగులని ఓ సాంగ్ కోసం తీసుకురావాలని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పవన్ డ్యాన్స్ స్టెప్స్, రమణ గోగుల వాయిస్, డీఎస్పీ మాస్ బీట్ అంటే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కు పండగే అవుతుంది.

అలాగే డీఎస్పీ కూడా ఇటీవల సైమా అవార్డ్స్ స్టేజ్ మీద ఈ ఆల్బమ్ గురించి హింట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం పవన్ గారు చేసే డ్యాన్సులు మాస్‌కు మరో లెవెల్‌లో ఉంటాయి. సాంగ్స్ కూడా గ్యారెంటీగా బ్లాక్‌బస్టర్ అవుతాయి అని చెప్పాడు. ఇప్పుడు దానికి తోడు రమణ గోగుల వాయిస్ కలిసిపోతే ఆల్బమ్‌కి హై లెవెల్ హైప్ వస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబినేషన్ న్యూస్ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News