• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఓ మై బేబీ' ట్రోలింగ్.....

'ఓ మై బేబీ' ట్రోలింగ్.. రామజోగయ్య సీరియస్

| కొంతమంది అయితే అసభ్య పదజాలంతో రామ జోగయ్య శాస్త్రి పై ఎదురుదాడికి దిగడంతో స్వయంగా ఆయనే ఈ ట్రోలింగ్స్ పై తన దైన శైలిలో స్పందించారు.

By - Tupaki Desk
Update: 2023-12-14 12:49 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా నుంచి నిన్న సాయంత్రం 'ఓ మై బేబీ' లిరికల్ వీడియో రిలీజ్ అయిన విషయం తెలిసిందే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పై ఎన్నో విమర్శలు వచ్చాయి. విచిత్రంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సాంగ్ పై అటు తమన్ ని ఇటు రామ జోగయ్య శాస్త్రిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

సాంగ్ పై ఫ్యాన్స్ మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందా? లేక అవుట్ పుట్ తేడా కొట్టిందా? అనేది తెలీదు కానీ సోషల్ మీడియా మొత్తం ఇదే హాట్ టాపిక్ అవుతుంది. కొంతమంది అయితే అసభ్య పదజాలంతో రామ జోగయ్య శాస్త్రి పై ఎదురుదాడికి దిగడంతో స్వయంగా ఆయనే ఈ ట్రోలింగ్స్ పై తన దైన శైలిలో స్పందించారు. ఈ మేరకు రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా..

"ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే. అభిప్రాయం చెప్పే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని.. మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేము గొప్పగా చేయలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి" అంటూ రాస్కొచ్చారు. దీంతో రామజోగయ్య శాస్త్రి చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు ఈ సాంగ్ ట్రోలింగ్ పై ఇప్పటివరకు తమన్ స్పందించింది లేదు.

థమన్ పై ట్రోల్ జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. అందుకే తమన్ దీన్ని లైట్ తీసుకుని ఉండవచ్చు అని కొందరు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు కారం సాంగ్స్ విషయంలో తమన్. ని ట్రోల్ చేయడానికి సాలిడ్ రీజనే ఉంది. అదేంటంటే, మహేష్ గత చిత్రం 'సర్కారు వారి పాట' కు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదని అసంతృప్తిలో ఫ్యాన్స్ ఉన్నారు. కళావతి సాంగ్ మినహాయించి మిగిలిన సాంగ్స్ పెద్దగా క్లిక్ కాలేదు.

సినిమాలో బీజీయం కూడా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారైనా తమన్ గుంటూరు కారం విషయంలో అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే గుంటూరు కారం సాంగ్స్ లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. గుంటూరు కారం నుంచి ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు వాటిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సాంగ్స్ అయినా ఈ నెగిటివిటీని దూరం చేస్తాయేమో చూడాలి.

Tags:    
  • Ramajogaiahsastry 
  • Tollywood 
  • Ohmybaby 
  • Maheshbabu 
  • Trivikram 
  • Thaman 
  • Sreeleela 
  • Song 
  • Trolling 
  • Socialmedia 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS