రామ్ పోతినేని బర్తడే స్పెషల్.. రెమ్యునరేషన్ తో పాటు ఆస్తుల వివరాలు!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టిన రామ్ పోతినేని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టిన రామ్ పోతినేని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్రవంతి రవి కిషోర్ సోదరుడి కొడుకుగా దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రామ్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా సౌత్ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన యాక్షన్, కామెడీ మూవీ రెడీతో తనలోని నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామ్ పోతినేని. మస్కా, కందిరీగ , పండుగ చేసుకో , హలో గురు ప్రేమకోసమే, ఇస్మార్ట్ శంకర్, రెడ్ ఇలా పలు చిత్రాలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ పోతినేని.. కమర్షియల్ గా మంచి విజయం సాధించి స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన రెమ్యూనరేషన్ తో పాటు ఆయన ఆస్తుల వివరాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ బడ్జెట్ కోసం సుమారుగా రూ.25 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.. ఇక ఆ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినా డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత ఒక్కో చిత్రానికి 15 కోట్ల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు అనడంలో సందేహం లేదు.కానీ ఈ యువ హీరో మాత్రం ఇప్పుడు వరుసగా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏకంగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇకపోతే రామ్ సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లతో పాటు ఇతర వ్యాపారాల ద్వారా సుమారుగా రూ.120 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.. ఇక రామ్ దగ్గర ఉన్న కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రీమియం బ్రాండ్స్ అయిన పోర్షే కయెన్, పోర్షే మకాన్ తో పాటు 2.50కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, రూ.2కోట్లకు పైగా విలువైన నిస్సాన్ జిటిఆర్ పెర్ఫార్మన్స్ కార్లు ఈయన సొంతం.
రామ్ పోతినేని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే మరొకవైపు డైరెక్టర్గా యూటర్న్ తీసుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా "రాపో 23" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాను వీర అనే పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా స్పష్టం చేశారు ..ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించిన రామ్.. తన ఫస్ట్ లుక్ తో పాటు ఒక వీడియోని కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మరి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమానైనా రామ్ కి మంచి స్టార్ స్టేటస్ ను అందివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.