11 ఏళ్ల ఏజ్ లో 18 ఏళ్ల రోల్.. మాసీ అండ్ క్లాసీ మన రాపో!

అందుకు గాను సూపర్ టాలెంట్ తో బాగా కష్టపడ్డారు. అటు క్లాస్.. ఇటు మాస్ జోనర్లలో సినిమాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నారు.;

Update: 2025-05-15 05:15 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రేంజే వేరు. ప్రత్యేక గుర్తింపు ఆయన సొంతం. సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అందుకు గాను సూపర్ టాలెంట్ తో బాగా కష్టపడ్డారు. అటు క్లాస్.. ఇటు మాస్ జోనర్లలో సినిమాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నారు.

క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా దగ్గరవడం రామ్ కే చెల్లిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏ సినిమాకు అయినా కంప్లీట్ మేకోవర్ చేసుకోవడంలో రామ్ అస్సలు వెనకాడడని ఎప్పుడూ సినీ వర్గాల్లో చర్చ జరగుతూనే ఉంటుంది. సినిమాల విషయంలో ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో కూడా ఎనర్జిటిక్ స్టార్ ముందే ఉంటారు.

ఏ సినిమా అయినా.. ఓ రోల్ అయినా.. సింపుల్ గా రామ్ అదరగొట్టేస్తారు. అయితే మిగతా హీరోల్లాగానే 19 ఏళ్ల సినీ కెరీర్ లో ఎత్తు పల్లాలు చవి చూసినా.. తన యాక్టింగ్ తో రామ్ నిరాశపరచడమనేది ఇప్పటి వరకు జరగలేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటుంది మరి. అదే సమయంలో డ్యాన్స్ తో ఓ రేంజ్ లో రామ్ ఆకట్టుకుంటారు.

ఆయన వేసే స్టెప్పుల్లోని గ్రేస్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. స్టంట్స్ విషయంలో అస్సలు వెనుకాడరు. హై రిస్క్ స్టంట్స్ ను ఇట్టే ఈజీగా చేసేస్తారు. ఆ విషయాన్ని డైరెక్టర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఏదేమైనా హీరోగా ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆయన బర్త్ డే నేడు. దీంతో పలు ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఓసారి తెలుసుకుందాం.

హైదరాబాద్ లో సెటిల్ అయిన విజయవాడకు చెందిన ఫ్యామిలీలో పుట్టిన రామ్.. చెన్నైలో చదువుకున్న టైమ్ లో షార్ట్ ఫిల్మ్ తో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన ఏజ్ 11 ఏళ్లు. కనిపించింది మాత్రం 18 ఏళ్ల వయసు ఉన్న పాత్రలో. మత్తు పదార్థాలకు బానిస అయిన రోల్ లో నటించిన రామ్.. అప్పుడే వేరే లెవెల్ లో అలరించారు.

వివిధ అవార్డులు కూడా అందుకుని సత్తా చాటారు. ఇక 18 ఏళ్ల వయసులో దేవదాస్ మూవీతో హీరోగా మారిన ఆయన.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూ టెంట్ అవార్డు అందుకోవడమే కాకుండా.. డెబ్యూ హీరో మూవీ భారీ వసూళ్లు రాబట్టడం అప్పట్లో సంచలనంగా మారింది.

అలా ఫస్ట్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారడం గమనార్హం. ఆ తర్వాత మస్కా, గణేష్, రామరామ కృష్ణకృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో, నేను శైలజ, శివం, హైపర్, ఉన్నది ఒకటే జిందగీ,హలో గురు ప్రేమ కోసమే అలా వరుస సినిమాల్లో నటించి అలరించారు రామ్.

ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఒక్కసారి షేక్ చేశారు. ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఎనర్జిటిక్ స్టార్.. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ పి.మహేష్ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్యాన్ బయోపిక్ గా రానున్న ఆ మూవీలో సాగర్ గా కనిపించనున్నారు. త్వరలోనే చిత్రం రిలీజ్ కానుంది. మల్టీ టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో రామ్ కు ఆ మూవీతో మంచి హిట్ దక్కాలని కోరుకుందాం. బర్త్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుదాం. హ్యాపీ బర్త్ డే రామ్!!

Tags:    

Similar News