బాహుబలి నిర్మాతలతో రామ్.. కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటేనే మాస్ స్టెప్పులు, లవర్ బాయ్ లుక్స్ గుర్తొస్తాయి. 'ఇస్మార్ట్' ఎనర్జీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం అతని స్టైల్.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటేనే మాస్ స్టెప్పులు, లవర్ బాయ్ లుక్స్ గుర్తొస్తాయి. 'ఇస్మార్ట్' ఎనర్జీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం అతని స్టైల్. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కథలు చేస్తే కిక్ ఏముంటుంది? అందుకే ఈసారి రామ్ రూటు మార్చారు. ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, ఈసారి సీటు అంచుల మీద కూర్చోబెట్టి భయపెట్టడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం 'ఆంధ్రా కింగ్ తాలూకా' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్, తన తర్వాతి సినిమా కోసం ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి, కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక 'హార్రర్' కథను ఎంచుకున్నారు. రామ్ పోతినేని హార్రర్ సినిమా చేయడం అంటేనే ఒక సెన్సేషన్.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాను నిర్మిస్తోంది సాక్షాత్తూ బాహుబలి లాంటి దృశ్యకావ్యాలను అందించిన 'ఆర్కా మీడియా వర్క్స్'. ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న ఆర్కా మీడియా, రామ్ తో సినిమా చేస్తుందంటే ఆ స్కేల్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇంత పెద్ద బ్యానర్, స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా అంటే బడా డైరెక్టర్ ఉంటారని అనుకోవడం సహజం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాతో 'కిషోర్' అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఒక డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథకు రామ్, ఆర్కా నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ స్క్రిప్ట్ లో విషయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో విరుపాక్ష లాంటి సినిమాలు హార్రర్ జానర్ లో టాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఇప్పుడు రామ్ లాంటి స్టార్ హీరో ఈ జానర్ లోకి రావడం కచ్చితంగా మంచి విషయమే. కొత్త దర్శకుడు కిషోర్ ఈ కథను కేవలం భయపెట్టడానికే కాకుండా, ఒక బలమైన ఎమోషన్ తో రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్.
'ఆంధ్రా కింగ్ తాలుకా'లో ఎమోషనల్ గా టచ్ చేసిన రామ్, నెక్స్ట్ ఆర్కా మీడియా ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ లో భయం పుట్టించడానికి సిద్ధమయ్యారు. అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మరి ఆ సినిమా ఎలాంటి స్టైల్ లో ఉంటుందో చూడాలి.