ఆంధ్రా కింగ్ తాలూకా అప్డేట్ పై రామ్ ఏమన్నాడంటే
అందుకే రామ్ స్టార్ హీరోగా మారలేకపోతున్నారు. టైర్2 హీరోల్లో టాప్ లో ఉండే అన్నీ క్వాలిటీస్ రామ్ కు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు రామ్ ఆ స్థాయికి చేరుకోలేదు.;
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు తయారైంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని వైనం. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ తో పాటూ మాస్ లో మంచి ఇమేజ్ ఉంది రామ్‌కు. కానీ కథల ఎంపికే చాలా దారుణంగా ఉంది. అందుకే రామ్ స్టార్ హీరోగా మారలేకపోతున్నారు. టైర్2 హీరోల్లో టాప్ లో ఉండే అన్నీ క్వాలిటీస్ రామ్ కు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు రామ్ ఆ స్థాయికి చేరుకోలేదు.
పాత ఫార్ములాకు వచ్చేసిన రామ్
దానికి కారణం అతను సెలెక్ట్ చేసుకునే కథలే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ఖాతాలో మరో హిట్ పడింది లేదు. ఆ సినిమా తర్వాత పూర్తిగా మాస్ మంత్రాన్ని జపించిన రామ్, వాటితో వరుస ఫ్లాపులు అందుకుని ఇప్పుడు తిరిగి తన పాత స్కూల్ కు వచ్చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం రామ్ ఓ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
కీలక పాత్రలో ఉపేంద్ర
ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా పై స్పందించిన రామ్
ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హీరో రామ్ చీఫ్ గెస్టుగా రాగా, ఆ ఈవెంట్ కు రామ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. రామ్ మాట్లాడుతున్న టైమ్ లో ఈలలు వేస్తూ గోల చేయగా, ఇది మన సినిమా ఈవెంట్ కాదు, మన ఈవెంట్ లో మాట్లాడుకుందామని చెప్పి వారిని కూల్ చేశారు రామ్.
ఆ తర్వాత యాంకర్ ఆంధ్రా కింగ్ తాలూకా అప్డేట్ ఎప్పుడొస్తుందని డైరెక్ట్ గా రామ్ ను అడగడంతో ఒక్కసారిగా షాకైన రామ్, పరదా సినిమా రిలీజ్ లోపు తన సినిమా అప్డేట్ ను ఇచ్చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఆగస్ట్ 22న పరదా సినిమా రిలీజవనుండగా ఈ లోపే ఆంధ్రా కింగ్ తాలూకాకు సంబంధించిన అప్డేట్ రానుందని రామ్ క్లారిటీ ఇచ్చేశారు. వివేక్- మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన నువ్వుంటే చాలే సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ కు స్వయంగా హీరో రామ్ లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను నిర్మిస్తోంది.