ఆంధ్రా కింగ్ తాలూకా: అందరి ఫోకస్ రామ్ పాటపైనే..

రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా మొదటి గ్లింప్స్‌తోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2025-07-15 17:57 GMT

రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా మొదటి గ్లింప్స్‌తోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఓ హీరోకు అభిమానిగా రామ్ వేసిన పాత్ర, ఆయన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఓ ఫ్యాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనేది మేకర్స్ చెప్పే మాట.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, భాగ్య శ్రి బోర్స్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నుంచి తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. జూలై 18న సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెలోడీగా ఉండనున్న ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడనుండడం విశేషం.

ఇక అసలైన స్పెషాల్టీ ఏంటంటే.. ఈ పాటకు రామ్ పోతినేని స్వయంగా లిరిక్స్ రాశారు. ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే ఆకట్టుకున్న రామ్, ఈసారి రచయితగానూ తన ప్రతిభను చాటబోతున్నారు. కొద్దిమంది నటులు మాత్రమే తమ సినీ కెరీర్‌లో రైటింగ్ ట్రై చేసిన ఉదాహరణలు ఉన్నా, రామ్ లాంటి యాక్టివ్ మాస్ హీరో నుంచి ఇది ఆశ్చర్యకరం. ఇదే అతని మొదటి లిరిక్ అడ్వెంచర్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

ఈ సినిమాకు వివేక్-మార్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మెలోడీ మాస్టర్స్‌గా పేరుగాంచిన ఈ మ్యూజిక్ డైరెక్టర్లు, రామ్ రాసిన పదాలకు అనిరుధ్ గాత్రం అందించడంతో పాటకి అదనపు ఆకర్షణ పెరిగిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాట వినగానే హృదయాన్ని తాకేలా ఉండబోతోందని, వినేవారి మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందని అంటున్నారు.

ఈ పాటలో రామ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రంగుల చొక్కాలో ఫన్నీగా నవ్వుతూ కనిపించిన ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. రామ్ స్టైలిష్ లుక్‌కి తగిన విధంగానే పాట తీర్చిదిద్దబోతున్నారని టాక్. సినిమా ప్రమోషన్స్‌లో ఈ పాట కీలకంగా నిలవనుందని భావిస్తున్నారు. ఈ విధంగా రామ్ నటనతో పాటు రచయితగా కూడా మెప్పించేందుకు సిద్ధమవ్వడం పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 18న ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోందని, మరి ఆ రోజున పాటతో పాటు రామ్ కొత్త టాలెంట్ ఏ స్థాయిలో క్లిక్కువుతుందో చూడాలి.

Tags:    

Similar News