శ్రీదేవి అనే చల్లని స్వచ్ఛమైన గాలి లో రాంగోపాల్ వర్మ!
అతిలోక సుందరి శ్రీదేవిని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతగా ఆరాదిస్తారో? చెప్పాల్సిన పనిలేదు.
అతిలోక సుందరి శ్రీదేవిని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతగా ఆరాదిస్తారో? చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో వర్మని మించిన అభిమాని మరోకరు ఉండరు అనడంలో అతిశయెక్తి లేదు. శ్రీదేవికి ఎంత మంది అభి మానులున్నా? వర్మ అభిమానం మాత్రం చెరగని సంతకం లాంటిందే. శ్రీదేవి అందానికి..ప్రతిభకి..పాత్రలకు దాసోహమైన ఏకైక వీరాభిమాని వర్మ. తాజాగా శ్రీదేవి గురించి వర్మమరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సాధారణంగా తాను మరణించిన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించనని వర్మ తెలిపారు. ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే వారు తన జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోయినట్లేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని ఆమె నటనపై ఉన్న అంతులేని గౌరవాన్ని ఈ సందర్భంగా వర్మమరో సారి గుర్తు చేసుకున్నారు. దివంగత నటి శ్రీదేవిపై తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఉందని, ఆమె నటనలోని ప్రతిభను ఎప్పటికీ మరువలేనన్నారు. ఇదే సమయంలో శ్రీదేవి బతికి ఉంటే బాగుంటుందనే భావోద్వేగమైన కోరి కను కూడా వ్యక్తపరిచారు. శ్రీదేవి మళ్లీ ఒక్కసారి ఈ భూమ్మీదకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆమె నిజంగానే ఈ ప్రపంచంలో జీవించి ఉండేదని.. ఆమె నటిగా సృష్టించిన అద్భుతాలు ఎలాంటివో మానవ సమాజానికి మరోసారి తెలియాలని ఆకాంక్షించారు. శ్రీదేవి మరణం తర్వాత కూడా తెరపై చేసిన అద్భుతాలను ఎవరూ మరువలేరని ప్రశంసించారు.
అలాగే శ్రీదేవి తో మొదటి పరిచయాన్ని ఆర్జీవి గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని శ్రీదేవి నివాసంలో తొలిసారి కలిసినప్పుడు ఆమె గదిలోకి వచ్చి వెళ్తుంటే చల్లని స్వచ్ఛమైన గాలి వీచినట్లు అనిపించిందని వర్మ తెలిపారు. శ్రీదేవి పర్సనాలిటీ .. స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతటి ప్రభావం చూపుతాయో వివరించారు. శ్రీదేతో పని చేయడం అరుదైన అనుభూతి అని, ఆమెలాంటి నటిని మరోకరిని చూడలేమని అభిప్రాయపడ్డారు.
శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న `ద ఎంప్రెస్` అనే పుస్తకంలో ఆర్జీవి కూడా ఓ ప్రత్యేక అధ్యాయాన్ని రాశారు. ఆ పుస్తకంలో తాను రాసిన భాగం ఎంతో ప్రత్యేకంగా వచ్చిందని? శ్రీదేవితో ఉన్న అనుభవాలను అందులో క్షుణ్ణంగా పొందుపరిచానని తెలిపారు. శ్రీదేవితో తనకున్న దశాబ్దాల అనుబంధం ఈ బయోగ్రఫీ ద్వారా మరింత దగ్గరవుతుందని వర్మ భావిస్తున్నారు.
వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరణించిన వారి గురించి తాను ఆలోచించనని చెప్పినా? ఆమె జ్ఞాపకాలను ... గొప్పతనాన్ని వర్మ గుర్తు చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. భారతీయ సినీ పరిశ్రమకు శ్రీదేవి అందించిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.