అది కూడా తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చిన వర్మ..!

వర్మకు దర్శకత్వంపై అవగాహణ లేదు, కానీ వందల కొద్ది హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభవంతో సినిమాలు ఎలా ఉంటే జనాలు చూస్తారు అనే విషయం తెలుసు.;

Update: 2025-06-14 19:30 GMT

సాదారణంగా దర్శకత్వం చేయాలంటే అంతకు ముందు ఇద్దరు ముగ్గురు దర్శకుల వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేయడంతో పాటు, పలు సినిమాలకు క్లాప్‌ బాయ్‌గా, సహాయ దర్శకుడిగా, సెట్‌ అసిస్టెంట్‌గా, సెకండ్‌ యూనిట్ దర్శకుడిగా చేసిన తర్వాత పూర్తి స్థాయి దర్శకత్వం చేసేందుకు రెడీ అవుతారు. కానీ కొందరు మాత్రం ఏ అనుభవం లేకుండా డైరెక్ట్‌గా డైరెక్టర్‌ అవుతారు. టాలీవుడ్‌లో అతి కొద్ది మంది మాత్రమే అనుభవం లేకుండా దర్శకత్వం వహించారు. అందులో రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు అనే విషయం తెల్సిందే. వీసీఆర్‌ లు కిరాయికి ఇచ్చే షాప్ నిర్వహించే వర్మ సినిమాలపై అభిరుచితో దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. మొదటి సినిమానే అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున హీరోగా చేసే అవకాశం దక్కించుకున్నాడు.

వర్మకు దర్శకత్వంపై అవగాహణ లేదు, కానీ వందల కొద్ది హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభవంతో సినిమాలు ఎలా ఉంటే జనాలు చూస్తారు అనే విషయం తెలుసు. ఆయనపై పెద్దగా నమ్మకం లేకుండానే నాగార్జున, నాగేశ్వరరావు ఒక ప్రయోగం అన్నట్లుగా శివ సినిమాను చేసే అవకాశం ఇచ్చారట. తాజాగా కుబేర సినిమా ప్రమోషన్‌ ఈవెంట్‌ లో నాగార్జున ఈ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్‌ చేశాడు. ప్రయోగంగా మాత్రమే శివ సినిమాను మేము చూశాం. కానీ ఆ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా నిలిచిందని నాగ్‌ అన్నారు. శివ సినిమా మేకింగ్‌ అనుభవాలను మాకు తెలియజేయండి అంటూ ఒక జర్నలిస్ట్‌ అడిగిన సమయంలో నాగార్జున సరదా సంఘటన గుర్తు చేసుకున్నాడు.

శివ సినిమా షూటింగ్‌ మొదటి రోజు ఫన్నీ సంఘటన జరిగింది. మొదటి రోజు, మొదటి షాట్‌ షూట్‌ చేసేందుకు అంతా రెడీ అయింది. రామ్‌ గోపాల్‌ వర్మ అంతకు ముందు అనుభవం లేదు. దాంతో కాస్త గందరగోళం క్రియేట్‌ అయింది. నేను, అమల ఏదో డైలాగ్‌ చెప్పుకుంటూ అలా నడుస్తూ ఉండాలి. ఆ షాట్‌కు అంతా రెడీ అయింది. మైక్‌ చేతిలో పట్టుకున్న వర్మ యాక్షన్‌ అంటూ అరిచాడు. కానీ అంతకు ముందు స్టార్‌ కెమెరా, క్లాప్‌ చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయం తెలియక వర్మ డైరెక్ట్‌గా యాక్షన్ అనేశాడు. దాంతో పక్కనే ఉన్న సినిమాటోగ్రాఫర్‌ గోపాల్‌ రెడ్డి కల్పించుకుని వర్మను వారించాడు. ఆ తర్వాత వర్మకు విషయం చెప్పి మళ్లీ షూట్‌ చేశాం. శివ సినిమా షూటింగ్‌ మొత్తం సరదాగా జరిగింది. అంతకు ముందు చేసిన సినిమాలతో పోల్చితే తనకు చాలా కొత్తగా అనిపించింది అన్నాడు.

కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగార్జున మరో వైపు రజనీకాంత్‌ కూలీ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించాడు. ఇలా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నాగార్జున సోలో హీరోగా మాత్రం ఈ మధ్య కాలంలో ఓకే చెప్పలేదు. ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా ప్రారంభం కాలేదు. గత ఏడాదిలో వచ్చిన నా సామి రంగ సినిమా తర్వాత నాగార్జున సోలో హీరో మూవీ రాకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు నాగార్జున కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అతి త్వరలోనే సినిమాను నాగ్‌ ప్రకటిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరో వైపు నాగార్జున బిగ్‌ బాస్ తెలుగు కొత్త సీజన్‌ కి ఓకే చెప్పాడని, ఇదే నెలలో ప్రోమో షూటింగ్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News