వ‌ర్మ పోలీస్ స్టేష‌న్ లో అస‌లేం జ‌రుగుతోంది?

వర్మ తనదైన శైలిలో క్రైమ్ - హర్రర్ జోనర్లను మిళితం చేస్తూ ప్రకటించిన `పోలీస్ స్టేష‌న్ మెయిన్ బూట్` ప్రాజెక్ట్‌పై ప్రారంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2026-08-11 09:34 GMT

సంచ‌ల‌న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాల గురించి ట్రేడ్ వర్గాల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ వ‌ర్మ గతంలో ప్రకటించిన సినిమాల్లో కొన్ని అనూహ్యమైన కారణాల వల్ల నిలిచిపోవడం లేదా ఆలస్యానికి గురికావడం జరుగుతుంటాయి. ఈ కోవకే చెందిన ఓ ఆసక్తికర ప్రాజెక్ట్‌పై గత కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో అసలు ఆ సినిమా వెనుక ఏం జరుగుతుందనే దానిపై సినీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

వర్మ తనదైన శైలిలో క్రైమ్ - హర్రర్ జోనర్లను మిళితం చేస్తూ ప్రకటించిన `పోలీస్ స్టేష‌న్ మెయిన్ బూట్` ప్రాజెక్ట్‌పై ప్రారంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు గ‌డుస్తున్నా? ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీ గానీ, ప్రచార చిత్రాలు గానీ బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందా ? మధ్యలోనే ఆగిపోయిందా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ..వ‌ర్మ‌ అభిమానుల్లో బ‌ల‌ప‌డుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ జాప్యానికి గురికావడానికి రామ్ గోపాల్ వర్మ అనుసరించే శైలి ... బడ్జెట్ పరమైన ఇబ్బందులని కొంత మంది అంచ‌నా వేస్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో ఒకే సమయంలో పలు ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, వాటిపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని సినిమాలు అనుకున్న వేగంతో ముందుకు సాగలేకపోతున్నాయి. అంతేకాదు నిర్మాణ పరమైన అడ్డంకులు .. ఫైనాన్షియల్ సమస్యల కారణంగా సినిమా పనులు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ జాప్యం వెనుక మరో కోణం కూడా ప్రచారంలో ఉంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ట్రెండ్‌కు తగినట్లుగా ప్రాజెక్ట్‌ల రూపురేఖలను మారుస్తుంటారు. కేవలం ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా మార్కెట్ డిమాండ్‌ను బట్టి కొత్త సబ్జెక్ట్‌ల వైపు దృష్టిని సారిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ నేపథ్యానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని భావించడం లేదా దానికి తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం వల్ల కూడా ఆలస్యం జరిగి ఉండవచ్చని మ‌రికొంత మంది భావిస్తున్నారు.

మరోవైపు దర్శకుడు వర్మ ఇతర క్రైమ్ థ్రిల్లర్స్ ..బయోపిక్ తరహా కథలపై దృష్టి పెట్టడం కూడా ప్రాజెక్ట్ వెనుక డుగు వేయడానికి ఓ కారణం కావచ్చు. కొత్త ప్రకటనలు రావడం, కొన్ని సినిమాలు కార్యరూపం దాల్చకపోవడం వర్మ కెరీర్‌లో సాధారణమే అయినా? ఈ సినిమాపై మాత్రం వ‌ర్మ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ రాకపోవడం గమనార్హం. మొత్తానికి ఎంతో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పట్టాలెక్కిన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నీడలో మగ్గి పోతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారా లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనేది వర్మ అధికారికంగా స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఏదేమైనా? కల్ట్ డైరెక్టర్ సినిమా ఇలా ఎలాంటి అప్‌డేట్ లేకుండా సైలెంట్ అయిపోవడం టాలీవుడ్, బాలీవుడ్ అభిమానుల్లో నిరాశను కలిగిస్తోందన్న‌ది వాస్త‌వం.

Tags:    

Similar News