కొత్త గెటప్ లో వర్మ.. ఫోటోలు వైరల్!
ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;
ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల కామెంట్లతో వార్తల్లో నిలిచే ఈయన.. తాజాగా బాలీవుడ్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా తన సరికొత్త గెటప్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు వర్మ.
ఈ మేరకు ఆ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ.. "అత్యంత ప్రతిభావంతులే నాకు చూపించిన.. ఊహించిన.. అమలు చేసిన సినిమా పాత్ర కోసం నా కొత్త లుక్ ఇదిగో. హే మహి నువ్వు నాలాంటి మృగాన్ని కూడా ఇంత అందంగా ఎలా చూపించావో నాకు అర్థం కాలేదు. అంటూ తన లుక్కుకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు వర్మ. చాలా స్టైలిష్ గా రెడ్ అండ్ బ్లాక్ చెక్ షర్ట్ ధరించిన ఈయన.. పైన డెనిమ్ జీన్స్ తో డిజైన్ చేసిన షర్ట్ ధరించారు. జీన్స్ ఫ్యాంట్ తో మోకోవర్ ను ఫుల్ ఫిల్ చేసిన ఈయన.. స్టైలిష్ గా కుర్చీలో కూర్చుని.. ఒక చేతిలో లైటర్.. మరొక చేతిలో సిగరెట్ పట్టుకుని చాలా స్టైలిష్ గా రగ్డ్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు వర్మ. వర్మను ఇలా కొత్త లుక్ లో చూసేసరికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే వర్మ కొత్త మూవీ కోసం కొత్త లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
రాంగోపాల్ వర్మ కొత్త సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈయన 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే సినిమాకి దర్శకత్వంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇందులో మనోజ్ బాజ్ పేయ్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఇక త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.
వర్మ విషయానికొస్తే.. 1962లో తూర్పుగోదావరి జిల్లా కృష్ణంరాజు , సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్ లో సెయింట్ మేరీస్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను.. విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ ను పూర్తిచేసిన ఈయన చిత్రరంగం పై ఎక్కువ శ్రద్ధ పెంచుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇకపోతే సినిమాల వేటలో బ్రతుకుతెరువు కోసం వీడియో దుకాణం నడిపిన ఈయన.. ఆ తర్వాత రావు గారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక దర్శకుడిగా అవకాశం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం లభించింది. అలా నాగార్జునతో శివ సినిమా చేసి సంచలనం సృష్టించారు. అంతం, గోవిందా గోవిందా వంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు వర్మ. ఇక ముఖ్యంగా రంగీలా, శివ, సత్య వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.