ఆ కేసులో ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరైన వర్మ!

వివాదాస్పద దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఒకవైపు సినిమాలతోనే కాదు మరొకవైపు కాంట్రవర్సీ మాటలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.;

Update: 2025-08-12 07:31 GMT

వివాదాస్పద దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఒకవైపు సినిమాలతోనే కాదు మరొకవైపు కాంట్రవర్సీ మాటలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు రాజకీయ అంశాలపై ఈయన చేసే కామెంట్లు ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. వర్మ గత వ్యూహం సినిమా విడుదల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే గత ఏడాది నవంబర్లో వారి ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసులో పలు పోలీస్ స్టేషన్లలో వర్మపై కేసు ఫైల్ అయింది. అదే సమయంలో ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కూడా వర్మపై కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టు నుంచీ బెయిల్ తెచ్చుకున్న వర్మకి.. హైకోర్టు బెయిల్ లభించినా.. పోలీసుల విచారణకు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో ఒకసారి విచారణకు హాజరైన వర్మ.. ఇప్పుడు మరొకసారి ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత నెల 22వ తేదీన నేరుగా ఒంగోలు పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. అప్పుడు నమోదైన కేసులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ పోలీసుల ముందు హాజరయ్యారు.. మరి విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు.. ? వర్మ సమాదానం ఏంటి? అనే విషయాలు ఉత్కంఠగా మారాయి.

రామ్ గోపాల్ వర్మ కెరియర్ విషయానికి వస్తే.. సినిమా దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు కూడా.. ఈయన తెలుగు చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా ప్రస్తుతం హిందీలోనే స్థిరపడ్డారు. ముఖ్యంగా శివ , క్షణక్షణం వంటి తెలుగు చిత్రాలతో పాటు రంగీలా, సత్య, కంపెనీ, భూత్ వంటి హిందీ చిత్రాలు కూడా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. 'వర్మ కార్పొరేషన్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు.

వర్మ బాల్యం విషయానికి వస్తే.. 1962 ఏప్రిల్ 7న తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు , సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పాఠశాల విద్యను, విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఈయనకు.. చదువు కంటే చిత్రరంగంపైనే ఎక్కువ శ్రద్ధ ఉండేది . అలా ఇంజనీరింగ్ పట్టా అందుకున్న తర్వాత 'రావుగారి ఇల్లు' అనే తెలుగు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశాన్ని అందుకొని.. ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాతో దర్శకుడిగా మారారు. తన అద్భుతమైన డైరెక్షన్ తో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు సైతం అందుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అడల్ట్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులలో విపరీతమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News