సరోగసి కాదు.. బేబీ బంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, ఉపాసన జంట.;

Update: 2026-01-06 04:00 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, ఉపాసన జంట. రామ్ చరణ్ సినిమాలలో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటే.. అటు ఉపాసన వ్యాపారరంగంలో బిజినెస్ ఉమెన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరియర్లో బిజీ కావడం వల్ల వివాహం జరిగిన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. అయితే కూతురు పుట్టి మూడేళ్లు అవుతున్నా.. ఇంకా పాప ముఖాన్ని ఇప్పటివరకు ఈ జంట బయట ప్రపంచానికి చూపించలేదు. ఇక దీంతో పాపని ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు

అయితే ఆ ఎదురుచూపుకి నిరాశ మిగిలింది. ఇంతలోనే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్.. కుటుంబ సభ్యుల మధ్య సీమంత వేడుకలను కూడా జరిపించారు. పైగా ఈసారి ఒకరు కాదు ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తోంది అంటూ మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది కూడా...అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు సీమంత వేడుకలు జరిగినా..కొంతమంది ఆకతాయిలు మాత్రం ఈసారి ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ చేశారు. అయితే ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం కూడా స్పందించలేదు. కానీ తాజాగా రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరగగా.. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అందులో ఉపాసన బేబీ బంప్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లారు. ఆయన ప్రత్యేకంగా బిర్యానీ వండి మరీఆ కుటుంబ సభ్యులకు తన చేతివంటను రుచి చూపించారు. ఇక అక్కడే రామ్ చరణ్, ఉపాసనతో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా కనిపించారు.అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా బయటకు వచ్చిన ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది. మొత్తానికి అయితే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఈ బేబీ బంప్ తో ఉపాసన చెక్ పెట్టింది అని చెప్పవచ్చు. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి ఇద్దరు వారసులకు జన్మనివ్వబోతుందని అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత రంగస్థలం సీక్వెల్ లో రామ్ చరణ్ నటించినబోతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News