చరణ్ ఈమధ్య ఎందుకిలా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నప్పటికీ, ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నప్పటికీ, ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు వరుసగా ట్రోలింగ్ కు కారణమవుతుండటంతో.. చరణ్ ఈమధ్య ఎందుకిలా? అనే ప్రశ్న అభిమానుల్లో ఇప్పుడు వినిపిస్తోంది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైంది. సినిమా విడుదలకు ముందు మేకర్స్ మధ్యప్రదేశ్ భోపాల్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో మూవీ రూపొందడంతో ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ కు స్పోర్ట్స్ పర్సన్స్ పై ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు హోస్ట్. సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల గురించి అడిగిన ప్రశ్నలకు చరణ్ వెంటనే సమాధానాలు ఇచ్చారు.
అయితే జస్ప్రీత్ బుమ్రా పేరు వచ్చినప్పుడు మాత్రం ఆయన పొరపాటున ఫుట్ బాల్ ప్లేయర్ గా భావించి ఆన్సర్ ఇచ్చారు. తాను పెద్ద అభిమానినని కూడా చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. అయితే వివాదం మరింత పెద్దదిగా మారకముందే చరణ్ స్పందించారు. బుమ్రాకు సారీ చెబుతూ, జనాల హడావుడి మధ్య అనుకోకుండా జరిగిన పొరపాటేనని వివరించారు.
కొన్నిసార్లు పేర్ల విషయంలో తాను మర్చిపోతున్నానని, కావాలని చేసిన తప్పు కాదని స్పష్టం చేశారు. దీంతో ఆ వివాదానికి తెరపడింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పెద్ది పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా అటెండ్ అయిన ఓ ఈవెంట్ లో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ గురించి మాట్లాడారు. తాను ఆ చిత్రాన్ని లాస్ట్ వీక్ చూసినట్లు పేర్కొన్నారు.
అయితే ఆ కామెంట్ నే కొందరు నెటిజన్లు మరోసారి ట్రోలింగ్ కు ఫీడ్ గా మార్చుకున్నారు. దీనికి కారణం, సినిమా విడుదలైన వెంటనే రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఆ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేయడమే. ఇప్పుడు తాను ఇటీవలే సినిమా చూశానని చెప్పడంతో, మూవీ చూడకముందే ఎలా ప్రశంసించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఆ విమర్శలను కంప్లీట్ గా ఖండిస్తున్నారు.
చరణ్ ఉద్దేశం వేరే అని, ఆయన ఇటీవల ఓటీటీలో మరోసారి సినిమా చూశానని చెప్పి ఉండొచ్చని అంటున్నారు. ఒక మాటను మరో యాంగిల్ లో అర్థం చేసుకుని అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా జెనరేషన్ లో సెలబ్రిటీల ప్రతి కామెంట్, ప్రతి ఎక్స్ప్రెషన్ వెంటనే వైరల్ అవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో చిన్న పొరపాట్లు కూడా పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.