• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లెక్కల మాస్టర్ 'మాస్టర్'...

లెక్కల మాస్టర్ 'మాస్టర్' ప్లాన్.. ఇది కదా ఫ్యాన్స్‌ కు కావాల్సింది..

| సుకుమార్ సినిమాలంటే కథలో కొత్తదనం, పాత్రల్లో డెప్త్, ప్రతి సీన్ లో లెక్కలు ఉంటాయని ప్రేక్షకులకు తెలిసిన విషయమే.

By - M Prashanth
Update: 2026-06-26 17:18 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌ లో ప్రత్యేకమైన క్రేజ్. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ అందించిన ఆ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల అంచనాలు పీక్స్‌ కు చేరుకున్నాయి. పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే ఆ ప్రాజెక్టుపై మొదటి ప్రకటన నుంచి పాన్ ఇండియా స్థాయిలో భారీ చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఆ ప్రాజెక్టును దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. కథ రేంజ్, సినిమా వరల్డ్ ను మరింత లోతుగా చూపించాలంటే రెండు భాగాలుగా చెప్పడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు తెలుగు స్టార్ హీరోలు చాలా మంది రెండు పార్టుల స్టోరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు ఆ ట్రెండ్‌ ను ఫాలో కాలేదు.

దీంతో ఈసారి నిజంగానే రెండు పార్టుల ప్లాన్ ఉంటే.. అది చరణ్ కెరీర్‌ లో తొలి టూ-పార్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ఇదే అంశం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. సుకుమార్ సినిమాలంటే కథలో కొత్తదనం, పాత్రల్లో డెప్త్, ప్రతి సీన్ లో లెక్కలు ఉంటాయని ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కథను ఎంత వరకు చెప్పాలనుకుంటే అంత వరకు మాత్రమే చెప్పే దర్శకుడిగా ఆయనకు పేరుంది.

అలాంటి దర్శకుడు ఒక కథను రెండు భాగాలుగా చెప్పాలనుకుంటున్నాడంటే.. అందులో విషయం ఎంత బలంగా ఉంటుందో అనే చర్చ కూడా మొదలైంది. అందుకే సోషల్ మీడియాలో దీనిని లెక్కల మాస్టర్ ప్లాన్ గా అభిమానులు అభివర్ణిస్తున్నారు. ఈసారి సుకుమార్ పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ అర్బన్ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో కథ నడుస్తుందని సమాచారం.

కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, పవర్‌ ఫుల్ రోల్స్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పెద్ది విజయోత్సవ వేడుకల్లో కూడా సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి" అంటూ ఒక్క మాటతో అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేశారు.

డిసెంబర్‌ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌తో పాటు ఇతర కీలక పాత్రల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెండు పార్టుల ప్రచారంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినప్పటికీ రంగస్థలం తర్వాత ఆ సూపర్ హిట్ కాంబినేషన్‌ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కథ, మేకింగ్, విజువల్ గ్రాండియర్ పరంగా మరోసారి సుకుమార్- చరణ్ కాంబో కొత్త రికార్టులు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Tags:    
  • ramcharan 
  • sukumar 
  • tollywood 
  • telugucinema 
  • rangasthalam 
  • panindia 

Similar News

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...

2026-11-14 06:43 GMT

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

2026-11-14 06:42 GMT

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

2026-11-14 06:33 GMT

దిల్ రాజు పై ఎవరికి అంత కోపం?

2026-11-14 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS