RC17: లోకల్ మాస్ కాదు.. గ్లోబల్ క్లాస్..

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 'రంగస్థలం'. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.;

Update: 2025-12-09 04:20 GMT

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 'రంగస్థలం'. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలుస్తున్నారు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈసారి రాబోయే సినిమా లోకల్ మాస్ కాదు, గ్లోబల్ క్లాస్ అని వినిపిస్తున్న టాక్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న బజ్ నిజమైతే, ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం.

బయటకు వస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమాను కేవలం తెలుగు, హిందీ లాంటి భారతీయ భాషల్లోనే కాకుండా, నేరుగా ఇంగ్లీష్ లో కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఇది డబ్బింగ్ సినిమాగా కాకుండా, ఒక హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ తో ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కే అవకాశం ఉంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ కు గ్లోబల్ వైడ్ గా వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక లొకేషన్ల విషయంలో కూడా సుకుమార్ తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అడవులు, పల్లెటూళ్లలో (రంగస్థలం, పుష్ప) సినిమాలు తీస్తున్న ఆయన, ఈసారి కథను ఏకంగా విదేశాల్లో నడపబోతున్నారు. దాదాపు 50 శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారని సమాచారం.

సాధారణంగా సుకుమార్ సినిమాల్లో లాజిక్స్, ఎమోషన్స్ బలంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఆయన ఒక 'ఫుల్ ఆన్ ఎంటర్టైనర్' స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. సీరియస్ డ్రామా కంటే వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, భారీ హంగులతో సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. రంగస్థలం చిట్టిబాబులో మనం చూసిన అమాయకత్వం కాకుండా, ఈసారి చరణ్ ను చాలా స్టైలిష్ గా, ట్రెండీగా చూపించే ఛాన్స్ ఉంది.

ఈ వార్తలు గనక నిజమైతే, సుకుమార్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నట్లే లెక్క. 'పుష్ప' సిరీస్ తో పూర్తిగా రగ్గడ్ లుక్ లోకి వెళ్లిపోయిన ఆయన, వెంటనే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం సాహసమే. చరణ్ ఇమేజ్ ను గ్లోబల్ ఆడియెన్స్ కు దగ్గర చేయడానికి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. లోకల్ గొడవలు పక్కన పెట్టి, చరణ్ సుకుమార్ కలిసి గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేయడం నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.

Tags:    

Similar News