ఆర్సీ 17 లో అలాంటి ఛాన్స్ తీసుకుంటుందా?
ఏది ఏమైనా? రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నయనతార నటిస్తుందనే వార్త ప్రేక్షకుల్లో కొత్త వైబ్రేషన్ తీసుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'RC17' పై అంచనాలు ఏ రేంజ్ ఏంజ్ లో ఉన్నాయో? చెప్పాల్సిన పనిలేదు.'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ విషయమై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో కీలక పాత్ర కోసం సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు తానే హీరోయిన్ అనే ప్రచారం ఊపందు కుంటుంది. చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా? ఈ రూమర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని అంతకంతకు పెంచేస్తోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నయనతారకంటూ సుస్థిరమైన స్థానం.. సోలో మార్కెట్ ఉన్నాయి. తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఘనత సాధించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌డమ్‌ను అంతకంతకు రెట్టింపు చేసుకుంటున్నారు. అలాంటి ఇమేజ్ ఉన్న నయనతార వేరొక స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర'అనగానే వెంటనే ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత నయనతార అలాంటి పాత్రలకు పూర్తిగా దూరమయ్యారు.
ఆమె ఎంచుకునే ప్రతి కథలో తన పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండేలా చాలా సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్నారు. కాబట్టి రామ్ చరణ్ సినిమాలో ఆమె నటించాలంటే? ఆ పాత్ర కథను శాసించే స్థాయిలో ఉండాలి. అప్పుడే ఆమె స్థాయికి.. ఇమేజ్‌కు న్యాయం జరుగుతుంది. నిడివి తక్కువ ఉన్న పాత్రల కోసం నయన్ తన క్రేజ్‌ను పణంగా పెట్టే సాహసం చేయరనేది అభిమానుల వెర్షన్. అయితే సుకుమార్ మేకింగ్ స్టైల్ గురించి తెలిసిన వారు మాత్రం ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సుకుమార్ తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకే కాకుండా ఇతర కీలక పాత్రలకు కూడా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఇస్తారు.
ఆ పాత్రల వల్లే సినిమాకు ప్రాణం పోసినట్లుగా డిజైన్ చేస్తారు. ఒకవేళ సుకు మార్ నిజంగానే నయనతార కోసం అలాంటి పవర్‌ఫుల్ పాత్రను రాసి ఉంటే? స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నయన్ ప్రాజెక్టులో భాగమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా? రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నయనతార నటిస్తుందనే వార్త ప్రేక్షకుల్లో కొత్త వైబ్రేషన్ తీసుకొచ్చింది. ఆమె నిజంగానే సినిమాలో నటిస్తే ప్రాజెక్టుకు పాన్ ఇండియా స్థాయిలో మరింత వెయిట్ పెరుగుతుంది. ఒకవేళ ఆ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేకపోతే? నయనతార సున్నితంగా ఆఫర్‌ను పక్కనపెట్టే అవకాశమే ఎక్కువ. ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది చిత్రబృందం అధికారికంగా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.