చరణ్, సుకుమార్ మూవీ.. కొత్త అప్డేట్ ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కలిసి కొంతకాలం క్రితం వర్క్ చేసిన రంగస్థలం.. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. చరణ్ క్రేజ్ ను విపరీతంగా పెంచింది. సుకుమార్ కు కూడా మంచి పేరును తీసుకొచ్చింది.
దీంతో ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ మరో సినిమా చేయనుండడంతో అంతా అప్పుడే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎలాంటి జోనర్ లో తీస్తారోనని మాట్లాడుకుంటున్నారు. పుష్ప-2 తర్వాత చేయనున్న మూవీ కావడంతో.. సుకుమార్ భారీ ఎత్తున సినిమాను రూపొందించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సుకుమార్.. చరణ్ మూవీ స్క్రిప్ట్ ను పూరి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకుందని తెలుస్తుండగా.. రీసెంట్ గా దుబాయ్ లో సుకుమార్, రామ్ చరణ్ కలిసినట్లు సమాచారం. దుబాయ్ లో ఇద్దరూ మీట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా స్క్రిప్ట్ పై కాస్త క్లియర్ గా చర్చించుకున్నారని వినికిడి.
నిజానికి.. కొన్ని రోజుల క్రితమే సుకుమార్ అండ్ టీమ్ దుబాయ్ కు వెళ్లిందట. అక్కడ స్క్రిప్ట్ ను పూర్తి చేయడంలో బిజీగా ఉండగా.. రామ్ చరణ్ ఇటీవల వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. అయితే చర్చలు పూర్తి చేసుకుని హైదరాబాద్ కూడా ఆయన వచ్చేశారని సమాచారం. దీంతో మరికొద్ది రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వనుందని టాక్.
అయితే చరణ్, సుకుమార్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండనున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ను సంప్రదించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
2026లో సినిమా షూటింగ్ మొదలు కానుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్.. పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ పనులు అన్నీ కంప్లీట్ అయ్యాక.. చరణ్ సుకుమార్ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు. మరి చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.