RC17.. సుకుమార్ కాదా?

ఈ నేపధ్యంలో, రామ్ చరణ్ తన 17వ సినిమాకి మరో దర్శకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.;

Update: 2025-04-05 01:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ 2026 సమ్మర్ లో విడుదల కానుందని సమాచారం. అయితే ఇప్పుడు చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌ అయిన RC17 గురించి న్యూ బజ్ వినిపిస్తోంది.

ఇదివరకే RC17 ప్రాజెక్ట్‌ కోసం దర్శకుడు సుకుమార్‌తో చరణ్ కలవనున్నట్టు అఫీషియల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. రంగస్థలం హిట్ తర్వాత ఈ కాంబో మళ్లీ కలిసి పని చేస్తుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ తన తదుపరి సినిమాను గ్లోబల్ లెవల్‌లో రూపొందించాలనే లక్ష్యంతో స్క్రిప్ట్ వర్క్‌ను మరింత విస్తృతంగా ప్లాన్ చేస్తున్నాడట. దీనివల్ల రామ్ చరణ్ సినిమాకు డిలే కావచ్చు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ నేపధ్యంలో, రామ్ చరణ్ తన 17వ సినిమాకి మరో దర్శకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ లైన్‌లో తాజాగా నిఖిల్ నాగేశ్ భట్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇటీవల కిల్ అనే హిందీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు, చరణ్‌తో సినిమా చేయబోతున్నాడని పుకార్లు గతంలో వచ్చినా, వాటిని అప్పట్లో అతనే ఖండించాడు. అయితే అవి పూర్తిగా అసత్యం కాదు.. అనే లైన్‌లో ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు మళ్లీ ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇటీవల విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం వచ్చినా, ఇప్పుడు మళ్లీ నిఖిల్ పేరు చరణ్ RC17 కు ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లు, డైరెక్టర్లు చరణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోగా రామ్ చరణ్ ప్రతీ ప్రాజెక్ట్‌ను జాగ్రత్తగా, స్ట్రాటజీకల్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ఆయనకు కమిట్ అవ్వాలంటే స్క్రిప్ట్ బలంగా ఉండాలి, కథలో న్యూ ఎనర్జీ ఉండాలి.

కిల్ తరహా యాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్‌ ఉండే సినిమా ఒకటి చరణ్‌కి సూటవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో నిఖిల్ ఒక మంచి కథ తీసుకురాగలడన్న నమ్మకంతో అతడి పేరు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇది జరిగితే చరణ్ ఫిల్మోగ్రఫీలో మరో కొత్త ఛాప్టర్ మొదలవుతుంది. మొత్తానికి సుకుమార్ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని తేలిపోతుండటంతో, చరణ్ తాత్కాలికంగా RC17 కోసం మరో ప్రాజెక్ట్ షురూ చేయొచ్చని టాక్ బలంగా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, నిఖిల్ నాగేశ్ భట్ పేరు చరణ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. మరి రామ్ చరణ్ నిర్ణయం ఏంటో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News