• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారెవ్వా.. చరణ్ మేకోవర్...

వారెవ్వా.. చరణ్ మేకోవర్ మామూలుగా లేదు!

| టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-09 15:09 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరింది. మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్నా.. ఇప్పటికీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పినా.. ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు.

అయితే క్రిస్మస్ కు కాకుండా.. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వాయిదా పడుతుందని.. సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ దిగుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చివరి షూటింగ్ షెడ్యూల్ ఓ వైపు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరోవైపు జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్.. తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారని సమాచారం.

ఇక చరణ్ నెక్స్ట్.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చరణ్ కూడా ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు! అందుకు సంబంధించి మేకోవర్ చేసుకునే పనిలో ఆయన ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అందుకు ప్రూఫ్ గా చరణ్ లేటెస్ట్ పిక్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

దర్శకుడు వీవీ వినాయక్ బర్త్ డే సందర్భంగా నేడు ఆయనను ఇంటికి ఆహ్వానించారు చిరు, చరణ్. ఆ సమయంలో బొకే ఇచ్చి చరణ్ విషెస్ చెబుతున్న పిక్స్ బయటకు వచ్చాయి. అందులో రామ్ చరణ్.. మాస్ రగ్డ్ లుక్ లో కనిపించారు. హెయిర్ అండ్ కండలను బాగా పెంచుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. RC 16లో చరణ్ మల్లయోధుడిగా కనిపిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. ఇప్పుడు లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే అది నిజమని అనిపించకమానదు.

ప్రస్తుతం చరణ్ కొత్త పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. గేమ్ ఛేంజర్ కోసం డీసెంట్ గా కనిపించిన ఆయన.. ఇప్పుడు మాస్ లుక్ లోకి చాలా త్వరగా ఛేంజ్ అయ్యారని చెబుతున్నారు. బాగా వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోందని, తక్కువ గ్యాప్ లోనే బాడీ పెంచడం మామూలు విషయం కాదని అంటున్నారు. ఎంత కష్టపడ్డారో అర్థమవుతోందని చెబుతున్నారు.

Tags:    
  • Ramcharan 
  • Charantransformation 
  • RC16 
  • Buchibabusana 
  • Janhvikapoor 
  • Gamchangermovie 
  • Vvvinayak 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS