సోలోగా పెద్ది.. పాన్ ఇండియా రికార్డులే గురి..?

RRR తో పాన్ ఇండియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆల్రెడీ తెలుగు రెండు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ స్టామినా ఏంటో తెలిసిందే.;

Update: 2026-01-09 05:40 GMT

RRR తో పాన్ ఇండియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆల్రెడీ తెలుగు రెండు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ స్టామినా ఏంటో తెలిసిందే. ఐతే ఈసారి పెద్ది సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు చరణ్. ట్రిపుల్ ఆర్ లో సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన చరణ్ ఆ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశాడు. ఐతే ఈసారి పెద్దితో మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యేలా చేస్తాడని అంటున్నారు.

బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది..

బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పోటీగా నాని ది ప్యారడైజ్ వస్తుందని అనుకున్నా ఆ సినిమా షూటింగ్ ఇంకా టైం పట్టేలా ఉందని మార్చి నుంచి సమ్మర్ కి సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారట. నాని ప్యారడైజ్ దాదాపు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే టాక్. సో మార్చి మంత్ ఎండ్ సోలోగా చరణ్ ఒక్కడే పెద్దితో వస్తున్నాడు.

పెద్ది సినిమాతో చరణ్ చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత సరైన సినిమా పడలేదు కాబట్టి నేషనల్ లెవెల్ లో చరణ్ సత్తా తెలియలేదు. అందుకే పెద్ది తో పాన్ ఇండియా రికార్డులనే గురిగా పెట్టుకున్నాడట చరణ్. సినిమాలో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, డాన్స్ ఒకటేంటి సినిమా ప్రియులకు ఒక మంచి ఫీస్ట్ ఇచ్చే సినిమాగా పెద్ది వస్తుంది. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కూడా మరో అసెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.

పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలని..

చరణ్ పెద్ది సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక చికిరి సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక త్వరలో సినిమా నుంచి మరో సాంగ్ ఇంకా రెండో టీజర్ కూడా వదులుతున్నారట. పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలని బుచ్చి బాబు కూడా చాలా ఫోకస్ తో పనిచేస్తున్నాడు. చరణ్ పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. మొత్తానికి పెద్ది విషయంలో అంచనాలు ఎలా ఉన్నాయో దానికి తగినట్టుగానే చిత్ర యూనిట్ మూవీని సిద్ధం చేస్తుంది.

రంగస్థలం తర్వాత చరణ్ మరోసారి ఒక మాస్ రోల్ తో మెస్మరైజ్ చేయనున్నారు. ఆల్రెడీ పెద్దిలో ఫస్ట్ షాట్ తోనే మెగా బ్లాస్ట్ అనిపించిన చరణ్ సినిమాతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తాడని అంటున్నారు. మరి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ రోజు రోజుకి పెరుగుతుండగా వాటిని అందుకునే స్టఫ్ సినిమాలో ఉండేలా బుచ్చి బాబు జాగ్రత్త పడుతునాడా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.

Tags:    

Similar News